వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఏడాది పాలన .. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు,సదస్సులు .. షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు అధికార టీడీపీని వద్దని వైసీపీకి ప్రజలు పట్టం కట్టిన రోజిది . ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నేడు . ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అటు వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉన్నాయి. వైసీపీ ఏడాది పాలనకు కితాబిస్తున్నాయి. ఏపీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని వైసీపీకి అధికారం కట్టబెట్టి నేటికి ఏడాది కావటంతో ఇక ఈ నేపధ్యంలోనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటేవైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటే

కార్యక్రమాల షెడ్యూల్ ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కార్యక్రమాల షెడ్యూల్ ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఇక ఈ కార్యక్రమాల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఈ మేరకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. ఏడాది కాలంగా వై సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు , అలాగే వివిధ పథకాల అమలు తీరుపై సదస్సులు నిరహింహాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మెరుగైన పాలనకు ఈ సదస్సుల ద్వారా సూచనలు ,సలహాలు తీసుకోనున్నారు.

 ఈ నెల 25 నుండి 30 వరకు సదస్సులు , ప్రత్యేక కార్యక్రమాలు

ఈ నెల 25 నుండి 30 వరకు సదస్సులు , ప్రత్యేక కార్యక్రమాలు

ఇక అందులో భాగంగా ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు . 25న పరిపాలన సంస్కరణలు-సంక్షేమం పై సదస్సు నిర్వహించనున్నారు . వైసీపీ పాలన సాగిస్తున్న నాటి నుండి వివిధ రంగాలలో చేపట్టిన పాలనా సంస్కరణలపై , అలాగే అందిస్తున్న సంక్షేమంపై సదస్సు నిర్వహించనున్నారు . ఇక 26న వ్యవసాయం-అనుబంధ రంగాలు, 27న విద్యారంగం సంస్కరణలు-పథకాలు, 28 న పరిశ్రమలు-పెట్టుబడుల రంగం, 29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు-పథకాలపై సదస్సులు నిర్వహించనున్నారు.

30 న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం

30 న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం

ఇక అంతే కాదు 30న సీఎం జగన్ బాధ్యత చేపట్టిన రోజు కావటంతో ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభించనున్నారు. మొదటి నుండి రైతు సంక్షేమం విషయంలో తండ్రి బాటనే అనుసరిస్తున్న తనయుడిగా ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు సీఎం జగన్ . అయితే ఈ సదస్సులన్నీ కరోనా లాక్ డౌన్ సమయం కావటంతో ఆన్ లైన్ పద్దతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది .

Recommended Video

Nagababu Satires AP Tourism Minister Avanthi Srinivasarao Over LG Polymers Issue
ఆరు రోజులు ఆన్ లైన్ లో సదస్సుల్లో పాల్గొననున్న సీఎం జగన్

ఆరు రోజులు ఆన్ లైన్ లో సదస్సుల్లో పాల్గొననున్న సీఎం జగన్

ఇక ఆరు రోజుల పాటు జరగనున్న అన్ని సమావేశాలలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆన్ లైన్ పద్దతిలో సదస్సులను ప్రభుత్వం నిర్వహించనున్న నేపధ్యంలో ప్రతి రోజు ఈ సదస్సులలో పాల్గొని అభిప్రాయాలను తెలుసుకుంటారు. మెరుగైన పాలనకు కావాల్సిన సూచనలు , సలహాలు తీసుకుంటారు. ఇక జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు జరగనున్నాయి. ఇక ఈ సదస్సులకు భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏది ఏమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడా ఆగకుండా పాలనలో తన మార్క్ ను , దూకుడును చూపిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ శ్రేణులు సంతోషంలో ఉన్నాయి.

English summary
YCP came to power and the year is over, the YCP ranks are celebrating. AP government announced that it will be holding special events . As part of this, various programs will be held from the 25th to the 30th of this month. Special events and conferences were designed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X