వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ తో జగన్ దోస్తీకి సై, చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి వైఎస్ఆర్ సీపీ కలిసి పోటీచేసేందుకు వ్యూహన్ని రచిస్తోంది.ఈ మేరకు పవన్ పార్టీతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమి ఏర్పాటుకు కూడ ఆ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి వైఎస్ఆర్ సీపీ కలిసి పోటీచేసేందుకు వ్యూహన్ని రచిస్తోంది.ఈ మేరకు పవన్ పార్టీతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమి ఏర్పాటుకు కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయత్నాలను వామపక్షాలు ప్రారంభించాయి.

2019 ఎన్నికలు వైసీపీకి చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఆ పార్టీకి ఏర్పడ్డాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకొనే ప్రయత్నం చేస్తోంది.

గత ఎన్నికల్లో టిడిపి బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకోవడం ఆ పార్టీకి కలిసివచ్చింది. అంతేకాదు కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముక్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనమనే అభిప్రాయంతో టిడిపికి ప్రజలు పట్టం కట్టారని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే గత ఎన్నికల నాటికి ప్రస్తుత పరిస్థితులకు మార్పులు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండేందుకు గాను అధికారపార్టీతో పాటు విపక్షాలు కూడ సన్నద్దమౌతున్నాయి.

 పవన్ తో జగన్ దోస్తీ?

పవన్ తో జగన్ దోస్తీ?


జనసేనతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ భావిస్తోందనే ప్రచారం సాగుతోంది. రెండు మాసాల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన కాపునేతలు పవన్ తో దోస్తీ ప్రతిపాదనను జగన్ వద్దకు తీసుకువచ్చారని సమాచారం.ఈ ప్రతిపాదనపై ఆలోచిద్దామని జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం.ప్రశాంత్ కిషోర్ కూడ జనసేన, వైసీపీ కలిసిపోటీచేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయని ప్రశాంత్ కిషోర్ రిపోర్టు ఇవ్వడంతో దోస్తీ ప్రతిపాదనపై ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం సాగుతోంది.

కాపు నేతలు జనసేనతో లాబీయింగ్

కాపు నేతలు జనసేనతో లాబీయింగ్

వైసీపీకి చెందిన కాపునేతలు వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు విషయమై లాబీయింగ్ ప్రారంభించారని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది.ఉత్తరాంధ్రకు చెందిన ఓ కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడికి ఈ బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం.టిడిపి బిజెపిలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి. అయితే వైసీపీ, పవన్ కళ్యాణ్ కలిస్తే విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

మహాకూటమి ఏర్పాటుకు సిద్దం

మహాకూటమి ఏర్పాటుకు సిద్దం

వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పనిచేసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.వైసీపీ కూడ పవన్ తో దోస్తీకి సిద్దమనే సంకేతాలను ఇస్తోంది. పవన్ కూడ తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని ప్రకటించారు. అయితే విపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పాటయ్యే అవకాశాలను కూడ పరిశీలిస్తున్నారు.కూటమి ఏర్పాటైతే విపక్షాల ఓటు చీలిపోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ కూటమికి కలిసిరానుంది.అయితే ఇదంతా ఇంకా ఆచరణరూపంలోకి రావాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోనున్న పవన్

ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోనున్న పవన్


ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కూడ కలిసిరానుంది. ఈ మేరకు వైసీపీ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల నష్టం కలుగుతోందనే అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. అందుకే కూటమిగా ఏర్పాటు కావడం వల్లే ప్రయోజనమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు. ఒకవేళ సాధ్యం కాకపోతే జనసేన, వైసీపీలు కలిసి ప్రయాణం చేస్తే సత్పలితాలు ఉంటాయని చెబుతున్నారు విశ్లేషకులు.

English summary
Ysrcp leaders planning to alliance with Jana Sena party in 2019 elections. Ysrcp chief Ys Jagan green signal with Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X