వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పా ఎఫెక్ట్: వైసీపీ అభ్యర్థిగా గంగుల ప్రతాప్ రెడ్డి?,టిడిపికి చెక్?

నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే ఈ స్థానం నుండి పోటీకి గంగుల కుటుంబం నుండి వైస

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే ఈ స్థానం నుండి పోటీకి గంగుల కుటుంబం నుండి వైసీపీ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు కన్పిస్తున్నాయి. గంగుల కుటుంబం ఈ స్థానం నుండి పోటీచేస్తే ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసే అభ్యర్థిని టిడిపి ఇంకా నిర్ణయించలేదు. ఈ స్థానం నుండి పోటీచేసేందుకుగాను శిల్పా మోహన్ రెడ్డి, భూమా కుటుంబం ఆసక్తిగా ఉంది. అయితే శిల్పా మోహన్ రెడ్డి ఒకానొకదశలో పార్టీని వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది.అయితే టిక్కెట్టు విషయంలో ఈ రెండు గ్రూపులను సమన్వయం చేసేందుకు టిడిపి నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.

అయితే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. భూమానాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు.వైసీపీలో చేరిన వెంటనే ఆయనకు ఆ పార్టీ ఎమ్మెల్సీపదవిని కట్టబెట్టింది.

నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకుగాను టిడిపి, వైసీపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.అయితే వైసీపీ గంగుల కుటుంబం నుండి ఈ స్థానం నుండి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా ఘటనలను చూస్తే అర్ధమౌతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గంగుల ఫ్యామిలీని బరిలోకి దింపనున్న వైసీపీ

గంగుల ఫ్యామిలీని బరిలోకి దింపనున్న వైసీపీ

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి భూమా కుటుంబం నుండి బరిలోకి దింపే అభ్యర్థిని టిడిపి బరిలోకి దింపితే గంగుల ప్యామిలీ నుండి అభ్యర్థిని బరిలోకి దింపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు గంగుల ఫ్యామిలీ నుండి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. గంగుల ప్రతాప్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయన వైసీపీ చీఫ్ జగన్ తో సమావేశం కావడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

భూమా మరణంతో గంగుల ఫ్యామిలీ పై చేయి సాధించేనా?

భూమా మరణంతో గంగుల ఫ్యామిలీ పై చేయి సాధించేనా?

భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డిలు అకాల మరణం చెందడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాలు వచ్చాయి. భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక నంద్యాల నియోజకవర్గం నుండి భూమా కుటుంబం నుండే టిడిపి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొంటే భూమా సోమశేఖర్ రెడ్డి తనయుడు బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది.


అయితే భూమా కుటుంబం నుండి రాజకీయాల్లో ఉన్న అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్ళు మాత్రమే. అయితే రాజకీయాల్లో సుదీర్ఘంగా అనుభవం ఉన్న గంగుల సోదరులను భూమా కుటుంబం ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదనే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే రాజకీయాల్లో అన్ని సమయాలు ఒకేలా ఉండవు. ఆయా సమయానికి అనుకూలంగా అనుసరించే ఎత్తుగడలు కూడ పనికొస్తాయి.

టిడిపిలో ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్

టిడిపిలో ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసే అభ్యర్థి విషయంలో టిడిపి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే ఈ స్థానం నుండి పోటీచేసేందుకుగాను మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు కూడ సిద్దమనే సంకేతాలను కూడ ఇచ్చారు శిల్పామోహాన్ రెడ్డి. అయితే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం నుండి ఎన్నికల్లో బరిలోకి దింపడం వస్తోన్న సంప్రదాయం.


అయితే భూమా నాగిరెడ్డి కుటుంబం నుండే టిడిపి అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. మరో వైపు ఎవరిని బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనమనే విషయమై సర్వే నిర్వహిస్తోంది టిడిపి.ఈ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా అభ్యర్థిని ప్రకటించనుంది.

మళ్ళీ ఆ కుటుంబాల మద్యే పోటీ సాగనుందా?

మళ్ళీ ఆ కుటుంబాల మద్యే పోటీ సాగనుందా?

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో గంగుల , భూమా కుటుంబాల మధ్య చాలా కాలం నుండి ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ రెండు కుటుంబాలు రాజకీయాల్లో కూడ ఉన్నారు. గంగుల కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటే భూమా కుటుంబం టిడిపిలో సుదీర్ఘకాలం కొనసాగింది. అటు తర్వాత పిఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ తిరిగి టిడిపిలో చేరారు భూమా నాగిరెడ్డి .అయితే నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మంత్రిగా ఉన్నారు.అదే సమయంలో ఈ స్థానం నుండి ఉప ఎన్నికల్లో భూమా కుటుంబం నుండి టిడిపి బరిలోకి దింపితే, వైసీపీ గంగుల కుటుంబం నుండి అభ్యర్థిని బరిలోకి దింపితే మళ్ళీ ఆ రెండు కుటుంబాల మధ్యే పోరాటం సాగనుంది.

English summary
Ysrcp planning to contest Gangula Pratap Reddy from Nandyala by poll.Gangula Pratap Reddy met Ysrcp chief Ys Jagan on Thursday. Tdp not yet finalized candidate for Nandyala by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X