వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా అస్త్రం: ఉప ఎన్నికలకు జగన్ ప్లాన్, అదే జరిగితే బాబుకు దెబ్బే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాజీనామాలతో ఉప ఎన్నికలు తీసుకురావాలని ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. ఉపఎన్నికల్లో టిడిపిని ఓడించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని వైపీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 6వ, తేదిన ఎంపీల రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఉప ఎన్నికలను కోసమే తాము ప్రయత్నిస్తున్నామని ఆ పార్టీ నేత పేర్నినాని చెప్పారు.

ప్రజల ప్రమేయం లేకుండానే విభజన, హమీలు నెరవేర్చకపోతే తిరుగుబాటు:పవన్ సంచలనంప్రజల ప్రమేయం లేకుండానే విభజన, హమీలు నెరవేర్చకపోతే తిరుగుబాటు:పవన్ సంచలనం

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళనున్నట్టు వైసీపీ నేత పేర్నినాని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భయపడుతున్నారని నాని అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటన కారణంగా టిడిపి నేతల్లో ఆందోళన నెలకొందన్నారు.

జెఎఫ్‌సి మీటింగ్: మాతో పనిచేసేందుకు ఎందరో: పవన్, ట్విస్టిచ్చిన వైసీపీ నేత తోట చంద్రశేఖర్జెఎఫ్‌సి మీటింగ్: మాతో పనిచేసేందుకు ఎందరో: పవన్, ట్విస్టిచ్చిన వైసీపీ నేత తోట చంద్రశేఖర్

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాలు చేయనున్నట్టు వైసీపీ చీప్ వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆందోళనలో భాగంగా పార్లమెంట్ సమావేశాల చివరి రోజున తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నట్టు ప్రకటించారు.

జెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరంజెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరం

అయితే ఈ ప్రకటనపై టిడిపి నేతలు ఎదురుదాడికి దిగారు. వైసీపీ ఎంపీల కంటే ముందుగానే టిడిపి ఎంపీలు కూడ రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ప్రకటనను వెనక్కు తీసుకొన్నారు. మరో వైపు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటామని టిడిపి ప్రకటించింది.

 వైసీపీ ప్లాన్ ఇదే

వైసీపీ ప్లాన్ ఇదే

ఎన్నికలకు ఏడాదిలోపుగా ఏదైనా స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ నిబంధనలు చెబుతున్నాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఏపీ రాష్ట్రంలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు 2019 మే లో జరగాలి. ఎంపీల పదవి కాలం జూన్‌తో ముగుస్తోంది. అయితే 2018 ఏప్రిల్ 6వ, తేదిన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే వారి పదవి కాలం ఇంకా ఏడాదిన్నర ఉంటుంది. అయితే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది,. ఖాళీగా ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాన్ని ఆరు మాసాల కంటే ఎక్కువ కాలం ఖాళీగా ఉంచకూడదనేది ఎన్నికల నిబంధన. ఈ నిబంధన మేరకే ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఆ ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే రాజకీయంగా టిడిపిపై పైచేయి సాధించినట్టేనని వైసీపీ ప్లాన్. అయితే అప్పటివరకు ఈ అంశాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.ఉఫ ఎన్నికల కోసం తాము ప్లాన్ చేస్తున్నామని వైసీపీ నేత పేర్ని నాని చెప్పారు.

 ముందస్థు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటీ

ముందస్థు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటీ

2019 మే లో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. కానీ, నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. 2018 చివర్లో ఎన్నికలు నిర్వహించాలని మోడీ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ మోడీతో పాటే ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం కూడ ఉంది. ఈ తరుణంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన తర్వాత ముందస్తు ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు రాకపోవచ్చు. అయితే ఉపఎన్నికల్లో కంటే నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని వైసీపీ ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోనుంది.

 సెంటిమెంట్ ను రగిల్చి

సెంటిమెంట్ ను రగిల్చి

ప్రత్యేక హోదా వల్ల ఏపీ రాష్ట్రానికిప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని హమీ ఇచ్చిన బిజెపి ఆ తర్వాత సాంకేతిక కారణాలతో ప్రత్యేక హోదాతో కూడిన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అయితే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడ కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రాలేదు. ఇస్తానన్న నిధులు కూడ రాలేదన్నారు.దీంతో ప్రత్యేక హోదా అంశమనే సెంటిమెంట్ ద్వారా ఓట్లను రాబట్టుకోవాలని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కేసు కోసమే బాబు ప్రయత్నాలు

కేసు కోసమే బాబు ప్రయత్నాలు

‘ఓటుకు నోటు' కేసు నుంచి బయటపడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపు, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రాయచోటిలో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ తీసింది. ఈ ర్యాలీలో రామచంద్రయ్య పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ..బడ్జెట్ కేటాయింపు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బాబు నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

English summary
Ysrcp leader perni Nani said that Ysrcp planning for by polls to parliment segments in Andhrapradesh.He spoke to media on Friday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X