వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్ వ్యూహం: బాబుకు జగన్ దెబ్బకు దెబ్బ, ఈ జాబితా తీస్తే చుక్కలు

నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిలో నిరూత్సాహం కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP counter To TDP with this list ప్రశాంత్ కిషోర్ వ్యూహం: బాబుకు జగన్ దెబ్బ | Oneindia Telugu

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిలో నిరూత్సాహం కనిపిస్తోంది. మరోవైపు టిడిపిని దెబ్బతీస్తూ, కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు వైసిపి అధిష్టానం ప్రయత్నిస్తోంది.

ఇక నుంచి టిడిపిని మరింత వ్యూహాత్మకంగా టార్గెట్ చేయాలని జగన్, ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ సామాజిక వర్గానికి పట్టం కడుతుందని జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.

అదే వ్యూహంతో టిడిపిని దెబ్బతీసేందుకు

అదే వ్యూహంతో టిడిపిని దెబ్బతీసేందుకు

టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే సామాజికవర్గానికి పట్టం కడుతున్నారన్న ప్రచారాన్ని నిదర్శనాలతో సహా నిరూపించేందుకు వైసిపి సిద్ధమవుతోంది. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని పదవులు కట్టబెట్టారన్న జాబితాను నాడు టిడిపి విడుదల చేసింది. ఇప్పుడు వైసిపి అదే వ్యూహం అనుసరించనుంది.

మరో అడుగు ముందుకు

మరో అడుగు ముందుకు

అయితే, అప్పుడు టిడిపి కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్లకే పరిమితమైతే ఇప్పుడు వైసిపి మరో పది అడుగులు ముందుకేసి, అసెంబ్లీ నుంచి వివిధ శాఖలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రభుత్వ ప్లీడర్లు, అడ్వకేట్ జనరల్, స్టాండింగ్ కౌన్సిళ్ల వరకూ కమ్మ సామాజికవర్గానికే పట్టం కడుతున్నారని ఆధారాలతో సహా చెప్పాలనుకుంటోంది.

ప్రశాంత్ కిషోర్ సూచన.. కసరత్తు ప్రారంభం

ప్రశాంత్ కిషోర్ సూచన.. కసరత్తు ప్రారంభం

అన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ మిగిలిన సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేదని, ఆయా సామాజిక వర్గాల దృష్టికి తీసుకు వెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. కాగా, పార్టీ వ్యవహారాలు పరిశీలిస్తున్న ప్రశాంత్ కిషోర్ గత విషయాలు కూడా అన్ని తెలుసుకొని, ఈ సూచన చేశారని తెలుస్తోంది.

పై నుంచి కింది స్థాయి వరకు తవ్వనున్నారు

పై నుంచి కింది స్థాయి వరకు తవ్వనున్నారు

సమాచారం మేరకు.. టిడిపి ప్రభుత్వం గత మూడున్నరేళ్ల నుంచి పై నుంచి కింది స్థాయి వరకూ జరిపిన వివిధ నియామకాలు, అంతకుముందు అందులో కొనసాగిన ఇతర సామాజిక వర్గాలను తొలగించి, వారి స్థానంలో సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించిన తీరును వివరాలతో సహా వెల్లడించనుంది.

అడ్వోకేట్ జనరల్ నుంచి

అడ్వోకేట్ జనరల్ నుంచి

అడ్వకేట్ జనరల్‌గా ఉన్న వేణుగోపాల్‌ను రాజీనామా చేయించడం, ఆయన స్థానంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడం మొదలు... ఇప్పుడు పిపిలు, స్టాండింగ్ కౌన్సిళ్ల సభ్యులుగా మెజారిటీ శాతం మళ్లీ అదే కులం వారిని కొనసాగిస్తున్నారని వైసిపి భావిస్తోంది.

లెక్కలు తీశాం

లెక్కలు తీశాం

ఆ లెక్కలన్నీ తీశామని, ఈ బాధ్యత తమ లీగల్ సెల్ ఇప్పటికే వేగంగా నిర్వహిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓ మీడియా సంస్థతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కీలక పదవులన్నీ వారికేనని

కీలక పదవులన్నీ వారికేనని

ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కీలకమైన పదవులు, అధికారుల నియామకాలు, అమరావతిలోని ఆ సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు, పోలీసు రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఐటి, ఆర్ అండ్ బి, న్యాయ, పంచాయతీరాజ్ శాఖల్లో ఆ వర్గానికి ఇచ్చిన పోస్టింగులు, కట్టబెట్టిన కాంట్రాక్టుల వివరాలను సేకరించే పనిలో ఉందని అంటున్నారు.

విజయవాడ, గుంటూరు.. నెల్లూరు దాకా

విజయవాడ, గుంటూరు.. నెల్లూరు దాకా

కోస్తాలో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ హవాకు మిగిలిన కులాలు నష్టపోతున్నాయన్న భావన అందరిలో ఉందని, విజయవాడ, గుంటూరులోనే కాదు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అదే పరిస్థితి ఉందని, ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన వారికే కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయని అంటున్నారు.

సీఎం బంధువు కంపెనీ కూడా

సీఎం బంధువు కంపెనీ కూడా

ఇందులో ముఖ్యమంత్రి బంధువు, మిత్రుడి కంపెనీ కూడా ఒకటి ఉందని, అన్ని దేవాలయాల సెక్యూరిటీ, ప్రభుత్వ ఆసుపత్రుల ఉద్యోగ నియామకాలన్నీ ఆ కంపెనీకే ఇచ్చారని ఓ నాయకుడు వెల్లడించారని అంటున్నారు.

కీలకమైన పోస్టుంగులు ఇచ్చినా..

కీలకమైన పోస్టుంగులు ఇచ్చినా..

కీలకమైన పోస్టింగులేవీ తమకు దక్కడం లేదని, ఒకవేళ దక్కినా తమను అక్కడ ఎక్కువరోజులు ఉండనీయడం లేదని ఇతర కులాలకు చెందిన చాలామంది అధికారులు మొరపెట్టుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

చూస్తున్నాం.. ఇక బయటపెడతాం

చూస్తున్నాం.. ఇక బయటపెడతాం

జాబితాను అంతటినీ తీసుకున్నామని, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని, చాలా రోజులుగా చూస్తున్నామని, ఇక ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాల్సిందేనని, ఆ సామాజిక వర్గం వల్ల పోస్టింగులు, అవకాశాలు పోగొట్టుకున్న వారి జాబితాను బయటపెడతామని వైసిపి నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.

ఎలా చేద్దాం.. వైసిపి డైలమా

ఎలా చేద్దాం.. వైసిపి డైలమా

అయితే, దీనిని నేరుగా మీడియా ముఖంగా వెల్లడించాలా? లేక సోషల్ మీడియా ద్వారా ఇతర సామాజికవర్గాల వారి వద్దకు తీసుకు వెళ్లాలా అనే విషయమై ఇంకా వైసిపి నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. ఇందుకోసం వైసిపి నేతలు సెక్రటేరియేట్, కమిషనరేట్ స్థాయి అధికారులు, కొందరు మీడియా ప్రముఖులను ఇప్పటికే సంప్రదిస్తున్నారని అంటున్నారు.

English summary
YSR Congress Party is ready to counter Telugu Desam Party with this list soon. It is said that YSRCP leaders are preparing the list of AG and consultants, standing counsils list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X