వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి రఘురామ కొత్త పేరు: పోర్నోగ్రఫీ కింద కేసు..ఎలా: పోతూ..పోతూ పట్టుకెళ్లేదేదీ లేదు

|
Google Oneindia TeluguNews

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.. సొంత పార్టీ ప్రభుత్వంపై మరోమారు నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రం దివాళా తీస్తోందని అన్నారు. 10 నెలల కాలానికే 73 వేల 912 కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని, దేశంలోనే అత్యధికంగా రుణాలను తీసుకున్న రాష్ట్రంగా మారిందని ఆయన చెప్పారు. ఏపీ కంటే ఎక్కువ సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో అప్పులు చేయలదని అన్నారు. రిజర్వ్‌బ్యాంక్ నుంచి చేబదుళ్లు దీనికి అదనమని చెప్పారు. రాష్ట్రం దివాళాంధ్రప్రదేశ్‌గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త ఓడరేవులు అనవసరం..

కొత్త ఓడరేవులు అనవసరం..

రామాయపట్నం, కాకినాడల్లో కొత్త నిర్మించ దలచిన ఓడరేవుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రఘురామ అన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పోర్టుల్లో గ్రోత్ రేట్ ఏమాత్రం నమోదు కావట్లేదని చెప్పారు. కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులు మూడేళ్లుగా ఆర్థికంగా పురోగమించలేెకపోతోన్నాయని అన్నారు. అప్పులు తీసుకొచ్చి పోర్టుల్లో పోయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉన్నవాటిని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోర్టులకు బదులుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం మేలని అభిప్రాయపడ్డారు.

మెడికల్ కార్పొరేషన్ ఎందుకు?

మెడికల్ కార్పొరేషన్ ఎందుకు?

ప్రభుత్వ ఆసుపత్రులను బాగుపర్చడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. దానికి అవసరమైన నిధులను ఎక్కడి నుంచి తెస్తారని రఘురామ ప్రశ్నించారు. దానికోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ అప్పులు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకొనే పోలవరం ప్రాజెక్టు నిధులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని జల వనరుల స్థీరకరణకు పోలవరం ప్రాజెక్టు అత్యవసరమని చెప్పారు.

వివేకాను చంపేస్తే పట్టించుకోలేదు గానీ..

వివేకాను చంపేస్తే పట్టించుకోలేదు గానీ..

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గానీ.. తనపై మాత్రం కేసులు శరవేగంగా నమోదవుతున్నాయని రఘరామ ఎద్దేవా చేశారు. తాను అనివార్య కారణాల వల్ల ఏపికి రాలేకపోయానని, ఆ మరుసటి రోజే ఎఫ్ఐఆర్‌లను వైసీపీ నేతలు నమోదు చేయించారని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి, మత మార్పిడుల గురించి ప్రస్తావించానని, దాన్ని ఆధారంగా చేసుకుని అరగంట వ్యవధిలో తనపై పలు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని స్పష్టం చేశారు.

 తాడేపల్లి ఆదేశాల మేరకే..

తాడేపల్లి ఆదేశాల మేరకే..

మతాల మధ్య చిచ్చుపెడుతున్నానంటూ తనపై కేసులు పెట్టించారని, తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తనపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా ఉన్నట్లు తాను భావిస్తున్నానని అన్నారు. తనపై కేసులు నమోదైన విషయాన్ని తాను లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లానని, ప్రివిలేజ్ మోషన్‌ను మూవ్ చేశానని చెప్పారు. దానిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశానని అన్నారు. తాను నియోజకవర్గానికి రాకపోవడానికి వైసీపీ నేతలే ప్రధాన కారణమని వెల్లడించారు.

 పోర్నోగ్రఫీ నిరోధక చట్టం కింద కేసు ఎలా..

పోర్నోగ్రఫీ నిరోధక చట్టం కింద కేసు ఎలా..


జాన్ కెనడీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టంలోని 67 ఏ కింద తనపై కేసు నమోదు చేశారని రఘురామ అన్నారు. పోర్నోగ్రఫీ వంటి అవాంఛనీయ సన్నివేశాలను ప్రసారం చేయడాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన ఈ చట్టం కింద తనపై ఎలా కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. తాడేపల్లి ఆదేశాల మేరకే తనపై ఈ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. వాటన్నింటినీ తాను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లను పిలిపిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

English summary
Ruling YSR Congress Party rebel MP K Raghu Rama Krishnam Raju given privilege motion to Lok Sabha Speaker against AP government advisor Sajjala Ramakrishna Reddy and DGP Gautam Sawang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X