వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్‌కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన ఈ నిర్ణయాన్ని జగన్ సర్కార్‌కు మెడుక చుట్టడానికిక ప్రయత్నిస్తోన్నాయి ప్రత్యర్థి పార్టీలు. దీని నుంచి గట్టెక్కడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు నిర్వహిస్తోన్న ఆందోళనకు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కేంద్రమంత్రులను కలుస్తున్నారు.

జగన్‌కు కోటి జీతం ఆఫర్: పనికిమాలినోళ్లకు కేబినెట్: కోర్టుల చుట్టూ: టీడీపీకి ఉప్పందించిన రఘురామజగన్‌కు కోటి జీతం ఆఫర్: పనికిమాలినోళ్లకు కేబినెట్: కోర్టుల చుట్టూ: టీడీపీకి ఉప్పందించిన రఘురామ

కేంద్రమంత్రులకే పరిమితమైన చోట..

కేంద్రమంత్రులకే పరిమితమైన చోట..

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సారథ్యంలో ఎంపీలు ఇప్పటికే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలంటూ వినతిపత్రాలను ఇచ్చారు. బీజేపీ మిత్రపక్షం జనసేన పార్టీ కూడా కేంద్రమంత్రిని కలవడం వరకే పరిమితమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిశారు. వారి డిమాండ్లను వారు వినిపించారు.

తొలిసారిగా ప్రధాని వద్ద నేరుగా..

తొలిసారిగా ప్రధాని వద్ద నేరుగా..

ఈ పరిణామాల మధ్య వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత.. రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రదానితో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నరేంద్ర మోడీ వద్ద తనకు ఉన్న పలుకుబడిని, పరపతిని రఘురామ కృష్ణంరాజు మరోసారి నిరూపించుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

విశాఖ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధానికి..

విశాఖ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధానికి..

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ ద్వారా మాత్రమే ప్రధానికి వినిపించగలిగారు. ప్రభుత్వ వైఖరిని ఆయన ఈ లేఖ ద్వారా స్పష్టం చేయగలిగారు. స్టీల్ ప్లాంట్‌ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావాలో వివరించగలిగారు. ప్రధానిని కలిసే ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఈ అంశంపై చర్చించడానికి వైఎస్ జగన్.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కూడా కోరలేదనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ విషయాన్ని పునరాలోచించాలంటూ రఘురామ కృష్ణంరాజు నేరుగా ప్రధానికే విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది.

బీజేపీ సానుభూతిపరుడిగా..

బీజేపీ సానుభూతిపరుడిగా..


వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ.. రఘురామ కృష్ణంరాజుకు భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడిగా గుర్తింపు ఉంది. కారణాలేమైనప్పటికీ.. రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆయన బీజేపీకి చేరువ కావడానికే ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం అనంతరం వైసీపీపై ఓ మినీ యుద్ధాన్నే చేస్తోన్నారాయన. ఏ మాత్రం అవకాశం దొరికినా రఘురామ కృష్ణంరాజు కాషాయ కండువాను కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది.

English summary
YSRCP rebel MP K Raghu Rama Krishnam Raju here on Saturday met Prime Minister Narendra Modi and submitted to him a memorandum. He reportedly takes another route to avoid Visakha Steel Plant (VSP) Privatisation and other political issues in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X