వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై ఫిర్యాదుల వెల్లువ -త్వరలో ఏపీకి అమిత్ షా -కేంద్ర హోం మంత్రితో వైసీపీ ఎంపీ రఘురామ భేటీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు తీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేంద్రంలోని మోదీ సర్కారుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం నాడు గంటల వ్యవధిలోనే ఏపీ ప్రతిపక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు, వైసీపీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజులు కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పలు అంశాలను ఎంపీలు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వివరాలిలా ఉన్నాయి..

జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ

కేంద్ర మంత్రితో రఘురామ భేటీ

కేంద్ర మంత్రితో రఘురామ భేటీ

అధికారికంగా వైసీపీలోనే కొనసాగుతున్నప్పటికీ, సొత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతిరోజూ విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం ఢిల్లీలో మరోసారి సందడి చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. కేంద్రం పెద్దలతో నిరంతరం టచ్ లో ఉంటూ, వీలైనప్పుడల్లా జగన్ సర్కారుపై ఫిర్యాదు లేఖలు రాస్తుండటం, వాటికి కేంద్రం నుంచి కూడా త్వరితగతిన రియాక్షన్ వస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ భేటీ అయ్యారు. 20నిమిషాల పాటు సాగిన భేటీలో మాట్లాడిన అంశాలను ఎంపీ రఘురామ మీడియాకు వివరించారు..

త్వరలో ఏపీకి అమిత్ షా..

త్వరలో ఏపీకి అమిత్ షా..

''ఏపీలో దేవాలయాలపై దాడుల కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరాను. నాకు వై కేటగిరీ భద్రత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపా. విభజన హామీలు, పోలవరం సహా అనేక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. విభజన చట్టం ప్రకారం రావలసిన నిధులు, రాష్ట్ర సమస్యలను వివరించాను. కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరతాయని ఆశాభావం ఉంది. రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులు, అమరావతి సెంటి‌మెంట్‌ను కూడా ప్రస్తావించాను. ఏపీ పర్యటనకు రావాలని అమిత్ షా గారిని కోరా, త్వరలో వస్తా అన్నారు. నా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు'' అని రఘురామ తెలిపారు. అంతకుముందు..

జగన్‌ను కేంద్రమే నిలువరించాలంటూ..

జగన్‌ను కేంద్రమే నిలువరించాలంటూ..

గడిచిన 19 నెలలుగా జగన్ పాలనలో ఏపీలో అరాచకం పేట్రేగిపోతోందని, మత మార్పిడులు, ఆలయాలపై దాడులు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, కుప్పకూలిన శాంతిభద్రతలు.. ఇలా ప్రతి అంశం వివాదాస్పదంగానే తయారైందని టీడీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. జగన్ రాజ్యాంగ వ్యతిరేక పోకడలను కేంద్రమే నిలువరించాలని కోరామని, ఏపీలో పరిస్థితులను చూస్తూ కూర్చోలేమని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. మొత్తంగా బుధవారం అమిత్ షా ఆఫీసు, నివాసం వద్ద ఏపీ నేతల సందడి, జగన్ పై ఫిర్యాదుల వెల్లువ కనిపించింది.

Recommended Video

#TOPNEWS : #IndiaTogether- Rihanna, Mia Khalifa లాంటోళ్లకు Amit Shah కౌంటర్

జగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలుజగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలు

English summary
Narasapuram YSRCP MP Raghu Ramakrishna Raju met Union Home Minister Amit Shah in Delhi on Wednesday. MP Raghuram said he had asked Amit Shah to expedite the investigation into the temple attacks case in the AP. Speaking to the media, the MP also criticized the Jagan government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X