వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు పేరెత్తితే అంటరానితనమంటారా- జగన్‌కు రఘురామ సూటి ప్రశ్న...

|
Google Oneindia TeluguNews

ఏపీలో బలహీనవర్గాలు కూడా ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకునేలా తాము కొత్త విధానం తీసుకొస్తే తాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులు అంటరానితనానికి నిదర్శనంగా ఉన్నాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంగ్లీష్‌ మీడియం వ్యతిరేకులకు అంటరానితనం అంటగట్టడమేంటన్న ప్రశ్న విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా దీనిపై స్పందించారు.

ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న వాదనల్లో అంటరానితనం- హోదా పోరాటం సాగుతోంది- జగన్ కీలక వ్యాఖ్యలు..ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న వాదనల్లో అంటరానితనం- హోదా పోరాటం సాగుతోంది- జగన్ కీలక వ్యాఖ్యలు..

తెలుగు నేర్పడాన్ని అంటరానితనంతో సీఎం జగన్ పోల్చడం బాధాకరమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు నేతలు అడ్డుకుంటున్నారని సీఎం జగన్ అనడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి సీఎం జగన్ ఆంగ్లమాధ్యమంపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నారు.

ysrcp rebel mp raghurama raju raise objections on jagans untouchability comments

Recommended Video

Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu

అమరావతి రాజధాని వ్యవహారంపైనా రఘురామ మరోసారి స్పందించారు. ఇవాళ రాజధాని ఉద్యమంలో పాల్గొన్న మరో రైతు అమరావతిలో మరణించాడని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు అమరావతి రైతులకు సీఎం జగన్ భరోసా ఇవ్వాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raises objections over cm jagan's independence day comments on opposition of english medium with untouchability.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X