India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ కథ ముగిసినట్లేనా ? 2024లోనే నరసాపురం ఎంట్రీ ! బీజేపీలో చేరిపోతారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం పోరు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇవాళ ప్రధాని మోడీ టూర్ కు కూడా రాకుండా సీఎం జగన్ విజయవంతంగా అడ్డుకట్ట వేశారు. ఇప్పటికే వైసీపీతో విభేదించడం మొదలుపెట్టిన తర్వాత మూడేళ్లుగా తన సొంత నియోజకవర్గం నరసాపురం వచ్చేందుకు ప్రయత్నిస్తున్న రఘురామరాజు విఫలమవుతూనే ఉన్నారు. కేంద్రం వై ప్లస్ భద్రత ఇచ్చినా ఆయన రాలేకపోయారు. ఇప్పుడు ప్రధాని మోడీ టూర్ కు కూడా రాలేకపోవడంతో ఇక నరసాపురానికి ఆయన ఎంటీ ఇప్పట్లో లేనట్లేనని తెలిపోయింది.

రఘురామకు భీమవరం నో ఎంట్రీ

రఘురామకు భీమవరం నో ఎంట్రీ


వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన భీమవరం వస్తే ఆరెస్టు చేస్తారన్న సంకేతాలు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అప్పటికప్పుడు కేసులు పెట్టి రఘురామను అరెస్టు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చిన రఘురామరాజును సీఐడీ పోలీసులు వెంటాడారు. చివరికి మార్గమధ్యంలోనే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని గ్రహించిన రఘురామ.. తన భీమవరం టూర్ రద్దు చేసుకుని వెళ్లిపోయారు.

మళ్లీ నెగ్గిన జగన్

మళ్లీ నెగ్గిన జగన్

రఘురామ రాజును విజయవంతంగా మూడేళ్లుగా నరసాపురం రాకుండా అడ్డుకుంటున్న సీఎం జగన్.. ఈసారి కూడా రెబెల్ ఎంపీని ఏపీలో అడుగుపెట్టనివ్వలేదు. హైదరాబాద్ లోనే అదుపులోకి తీసుకునే ప్రమాదం ఉండటంతో రఘురామ వెనక్కి తగ్గారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రఘురామపై జగన్ దే పైచేయి అయింది. ఇప్పటికే జగన్ తో పోరాటంలో పలు అంశాల్లో వరుస ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న రఘురామకు ఇది మరో షాక్ గా మారింది. దీంతో జగన్ పై పోరు కొనసాగించే విషయంలో రఘురామ నిర్ణయం కీలకం కానుంది.

2024 ఎన్నికల వరకూ ఇంతేనా ?

2024 ఎన్నికల వరకూ ఇంతేనా ?

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడు సిట్టింగా్ ఎంపీ హోదాలో అయినా, లేకపోతే నరసాపురం నుంచి పోటీ చేసే అభ్యర్ధిగా అయినా ఏపీలోకి రఘురామరాజు అడుగుపెట్టేందుకు అవకాశం దొరుకుతుంది. అప్పుడు కూడా అరెస్టు చేస్తే హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల్లో ప్రచారం, పోటీ కోసం ఆదేశాలు పొందేందుకు అవకాశం దొరుకుతుంది. అప్పటివరకూ మాత్రం రఘురామరాజు ఢిల్లీలోనే ఉంటూ పాత కేసులపై న్యాయ పోరాటం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రఘురామ బీజేపీలో చేరిపోతారా ?

రఘురామ బీజేపీలో చేరిపోతారా ?


వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో రఘురామరాజుకు గతంలోలా మద్దతు కూడా లభించడం లేదు. గతంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ రఘురామరాజుకు అన్ని విధాలా సహకరించేవారు. ఆయనపై చర్యలు తీసుకుంటే స్పందించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్దితి కనిపించడం లేదు మరోవైపు 2024 ఎన్నికల వరకూ రఘురామకు ఏపీలో ఎంట్రీ దొరికేలా కనిపించడం లేదు. దీంతో జగన్ కరుణిస్తే తప్ప 2024 ఎన్నికల్లోగా, ఆ తర్వాత అయినా రఘురామ ఏపీలో అడుగుపెట్టే వీలుంటుంది. మరోవైపు కేంద్రం నుంచి ఆయనకు ఎలాంటి సాయం అందడం లేదు. అనర్హత వేటు వేయకుండా ఆపడం మినహా కేంద్రం నుంచి సాయం దొరక్కపోవడంతో ఇక రఘురామ నేరుగా బీజేపీలో చేరిపోవడం మినహా ఏ దారీ కనిపించడం లేదు. అదే జరిగితే అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు.

English summary
ysrcp rebel mp raghurama raju's cancellation of today's bhimavaram tour has been nothing but door close for him till 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X