• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తోలు తీస్తారా ? టైమ్‌ చెప్పండి వస్తానంటున్న రఘురామ- సస్పెండ్‌ చేయాలని సవాళ్లు

|

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం అసంతృప్తి స్వరం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు తనకు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్‌పై తీవ్రంగా స్పందించారు. కరోనా వల్లే సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లడం లేదన్న రఘురామరాజు.. సీఎం జగన్‌ చుట్టూ కొందరు వ్యక్తులు చేసి నటిస్తున్నారని, ఆయన కూడా వారినే పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండేలా సీఎంకు దేవుడు మంచి శక్తిని ప్రసాదించాలని రెబెల్‌ ఎంపీ కోరుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నుంచి చేతనైతే తనను బహిష్కరించాలని సవాళ్లు కూడా విసురుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు.

మాన్సాస్‌ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ ? దోపిడీ కోసమే సంచైత- రఘురామరాజు సంచలనం..

 రఘురామకు బెదిరింపు కాల్స్‌

రఘురామకు బెదిరింపు కాల్స్‌

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం విమర్శలు చేస్తున్న రెబెల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పట్టించుకోవద్దని అధిష్టానం నుంచి సూచనలు వస్తున్నా కిందిస్ధాయిలో నేతలు, కార్యకర్తలు మాత్రం ఆయనకు కాల్స్‌ చేస్తూనే ఉన్నట్లు తెలుస్త్తోంది. ముఖ్యంగా ఆయన్ను వైసీపీకి రాజీనామా చేసి తిరిగి గెలవాలని కొందరు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపులపై కేంద్రాన్ని సంప్రదించి భద్రత పొందిన రఘురామ.. ఢిల్లీలో ఉన్నప్పటికీ ఈ కాల్స్‌ ఆగడం లేదని తెలుస్తోంది. దీంతో బెదిరింపు కాల్స్‌ వ్యవహారంపై రఘురామ మరోసారి తీవ్రంగా స్పందించారు. బెదిరింపులకు భయపడబోనని ఆయన స్పష్టం చేశారు.

 తోలుతీస్తారా... ఎక్కడో చెబితే వస్తా....

తోలుతీస్తారా... ఎక్కడో చెబితే వస్తా....

కొందరు వ్యక్తులు తనకు ఫోన్‌కాల్స్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తాజాగా రఘురామ మరోసారి ఆరోపించారు. అలాంటి వ్యక్తులు సమయం చెబితే తానే వాళ్ల వద్దకు వెళ్తానన్నారు. కరోనా కారణంగానే తాను సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లలేకపోతున్నట్లు రఘురామ తెలిపారు. అంతే తప్ప వీరి బెదిరింపులకు భయపడి కాదన్నారు. బెదిరింపులపై కేంద్రాన్ని సంప్రదించి మరీ భద్రత పొందిన రఘురామ ఇప్పటికీ నరసాపురం వెళ్లలేకపోతున్నారు. దాడుల భయంతో రఘురామ ఢిల్లీకే పరిమితం అవుతున్నారన్న విమర్శల నేపథ్యంలో కరోనా వల్లే తాను ఢిల్లీలో ఉంటున్నట్లు రఘురామ చెబుతున్నారు.

 చెప్పుడు మాటలు వింటున్న జగన్...

చెప్పుడు మాటలు వింటున్న జగన్...

సీఎం జగన్‌, వైసీపీ అధినేత జగన్‌ చుట్టూ కొందరు వ్యక్తులు చేరి నటిస్తున్నారని, ఆయన కూడా వారి మాటే వింటున్నారని రఘురామ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులను గుర్తిస్తే పార్టీకి మంచి జరుగుతుందని సలహా ఇచ్చారు. మంచి వాళ్లను, నటించే వాళ్లను గుర్తించే శక్తిని జగన్‌కు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు రెబెల్‌ ఎంపీ వెల్లడించారు. సీఎం జగన్‌ను కలిసే అర్హత తనకు లేదంటున్నారని, అందుకు తనకు బాధ లేదని, ఇంకా మంచి వ్యక్తులను కలిసే అవకాశం ఉందన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి తనకు కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, వీరంతా జగన్‌ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామ పేర్కొన్నారు.

  Bus Services Between Two Telugu States Update | Oneindia Telugu
   సస్పెండ్‌ చేయాలని సవాళ్లు...

  సస్పెండ్‌ చేయాలని సవాళ్లు...

  మరోవైపు వైసీపీ తరఫున గెలిచిన తనను సస్పెండ్‌ చేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని, చేతనైతే సస్పెండ్‌ చేయాలని రఘురామ తాజాగా సవాల్‌ విసిరారు. తనను సస్పెండ్‌ చేసే అవకాశం వారికి లేదన్నారు. వైసీపీకి తనను బహిష్కరించే దమ్ము లేదన్నారు. వైసీపీకి తనను బహిష్కరించే దమ్ములేక పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని రఘురామ వ్యాఖ్యానించారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, దీన్ని ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేక తనపై బెదిరింపులకు దిగుతున్నారని రఘురామ తెలిపారు. ఇప్పటికే వైసీపీ నేతలు రఘురామ తీరుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుండటంతో రఘురామ సవాళ్లకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

  English summary
  ysrcp rebel mp raghurama raju on thursday seriously reacted over threatening calls made by his own party leaders and says that he will reach them once fix the time and date.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X