వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ.. ఈ సారి మండపాలపై, హిందువుల ముఖ్యపండుగ

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు మరోసారి లేఖాస్త్రం సంధించారు. సీఎం జగన్‌కు రెండు పేజీల లేఖ రాసిర రఘురాముడు.. వినాయక చవితి పండగ గురించి ప్రస్తావించారు. పండగ చేసుకునే వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని లేఖలో కోరారు. ఇందుకోసం పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారులను ఆదేశించాలని కోరారు.

రాష్ట్రంలోని ప్రముఖల ఆలయాలు తెరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వినాయక చవితి రోజున పూజలు చేస్తే మంచిదని.. కానీ అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. హిందువులకు ముఖ్యమైన పండగ వినాయక చవితి అని పేర్కొన్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడిని హిందువులు భక్తి శ్రద్దలతో పూజిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఏ శుభకార్యం చేసిన.. గణనాథుడిని పూజిస్తారని తెలిపారు.

నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకులను నిర్వహించేందుకు అనుమతించకపోవడం దారుణమని రఘురామ అన్నారు. ఇప్పుడే స్వాతంత్ర్య ఉద్యమ సమయం నుంచి చవితి వేడుకలు కులమతాలకతీతంగా జరుపుకొంటున్నామని తెలిపారు. కానీ ఇప్పుడు మండపాలు ఏర్పాటు చేసువారిని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నానని తెపారు.

ysrcp rebel mp raghurama writes letter to cm jagan

స్వాతంత్య్రం జన్మహక్కు అని నినాదించిన బాలగంగాధర్ తిలక్ సామూహికంగా వినాయక చవితి వేడుకలు జరుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇదివరకు ప్రభుత్వం మండపాలకు అనుమతి ఇచ్చేదని తెలిపారు. ఈ సారి కూడా అనుమతి ఇచ్చి.. నిమజ్జనం కోసం క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై హిందుమత పెద్దలు, స్వామిజీ, మఠాధిపతులు, హిందూ సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రఘురామ కోరారు.

English summary
ysrcp rebel mp raghurama krishna rahu writes letter to cm jagan on vinayaka chaviti festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X