వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్రేజ్ బాగా తగ్గింది -చంద్రబాబు ఇంకా కిందికి -వైసీపీ, టీడీపీల విరాళాల్లో తగ్గుదల: ఈసీ రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ, చంద్రబాబు సారధ్యంలోని టీడీపీకి విరాళాలు అమాంతం తగ్గిపోయాయి. జగన్ పార్టీకి ఒక మోస్తారుగానైనా డొనేషన్లు రాగా, చంద్రన్న పార్టీకి మాత్రం అనూహ్యంగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడప్పుడే ఎన్నికలు లేకపోవడం వల్లే.. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతోన్న వైసీపీకి, అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి చేరిన టీడీపీకి విరాళాలిచ్చే దాతల సంఖ్య తగ్గింది..

మజ్లిస్ పార్టీకి విరాళాల వెల్లువ -ఓవైసీకి దేశమంతటా క్రేజ్ -టీఆర్ఎస్ డేటా రాలేదు -ఈసీ రిపోర్ట్మజ్లిస్ పార్టీకి విరాళాల వెల్లువ -ఓవైసీకి దేశమంతటా క్రేజ్ -టీఆర్ఎస్ డేటా రాలేదు -ఈసీ రిపోర్ట్

ఈసీకి కాంట్రిబ్యూషన్ రిపోర్టు

ఈసీకి కాంట్రిబ్యూషన్ రిపోర్టు

దేశంలోని ప్రాంతీయ పార్టీలు తమ దాతల వివరాలను భారత ఎన్నికల సంఘానికి తెలియజేసే కాంట్రిబ్యూషన్ రిపోర్టులను తాజాగా అప్ డేట్ చేశారు. అందులోని వివరాల ప్రకారం ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు 2018-19 ఏడాదితో పోల్చితే.. 2019-20 ఏడాదిలో విరాళాలు తక్కువ మొత్తంలో వచ్చాయి. 2018-19లో వైసీపీకి ఏకంగా రూ.80.57కోట్లు, టీడీపీకి రూ.26.17 కోట్లు లభించగా.. గతేడాది(2019-20)లో మాత్రం వైసీపీకి రూ.8.9కోట్లు, టీడీపీకి అతితక్కువగా రూ. 2.6 కోట్ల విరాళాలు వచ్చాయి. అందులోనూ..

 టీడీపీకి సమానంగా శేఖర్‌రెడ్డి ఒక్కడే

టీడీపీకి సమానంగా శేఖర్‌రెడ్డి ఒక్కడే

2019-20 ఏడాదికిగానూ ఈసీకి సమర్పించి కాంట్రిబ్యూషన్ రిపోర్టు ప్రకారం.. టీడీపీకి వచ్చిన విరాళాలకు దాదాపు సమాన మొత్తాన్నిఅంటే రెండున్నర కోట్ల రూపాయాలను ఒక్క జేఎస్ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీనే వైసీపీకి సమర్పించుకోవడం గమనార్హం. ఈ జేఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ.. టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, చెన్నైకి చెందిన జే శేఖర్ రెడ్డికి చెందినది తెలిసిందే. ఇక నెల్లూరుకు చెందిన పి.శివకుమార్ రెడ్డి కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఐబీ ఇన్‌ఫ్రా ఫ్రైవేట్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన యునైటెడ్ టెలీలింక్స్ సైతం జగన్ పార్టీకి డొనేషన్ ఇచ్చాయి. 2018-19లో వైఎస్సార్సీపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.181 కోట్లు రాగా... అంతకు ముందు ఏడాది రూ.14.2 కోట్లు వచ్చాయి. ఇక..

 చెన్నై నుంచి చంద్రబాబుకు ఫ్లో..

చెన్నై నుంచి చంద్రబాబుకు ఫ్లో..

ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి 2019-20 ఏడాదిలో వచ్చిన విరాళాల్లో ఎక్కువ మొత్తం చెన్నై నుంచే రావడం గమనార్హం. చెన్నైకి చెందిన ట్రింఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి టీడీపీ కోటి రూపాయలు డొనేషన్ రాగా.. జన చైతన్య హౌసింగ్ ప్రయివేట్ లిమిటెడ్ ఆ పార్టీకి రూ.20 లక్షలు విరాళమిచ్చింది. స్వాతి వార పత్రికను నడిపే వేమూరి బలరామ్ ఆయనకు చెందిన అనిల్ స్వాతి బలరామ్ ఫౌండేషన్‌ టీడీపీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, ఎమ్మెల్సీ పర్చూరు అశోక్ బాబు సైతం టీడీపీకి భారీగా విరాళలిచ్చారు.

జగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు-టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనంజగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు-టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనం

English summary
With the absence of elections now, donations to the ruling YSRCP and the opposition TDP in the AP have declined. According to the contribution reports submitted to the Central Electoral Commission, donations to these parties were lower in 2019-20 compared to 2018-19. In 2019-20, Rs. 2.6 crore and Rs. 8.9 crore to YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X