వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్ధానిక ఎన్నికల వాయిదాతో తారుమారైన వైసీపీ లెక్కలు- అంతర్మథనంలో నేతలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరును క్లీన్ స్వీప్ చేస్తామన్న ధీమాలో ఉన్న అధికార వైసీపీ నేతలకు ఎన్నికల కమిషనర్ తాజా నిర్ణయం షాకింగ్ గా మారింది. దీంతో ఇప్పటివరకూ పోటీ చేస్తే చాలు గెలుపు తథ్యమని అంచనా వేసుకుని ఎన్నికలపై భారీగా ఖర్చుపెట్టుకున్న నేతలంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కూడా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటోంది.

 స్ధానిక పోరు - వైసీపీ అంచనాలు

స్ధానిక పోరు - వైసీపీ అంచనాలు

ఏపీలో స్ధానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అని రాష్ట్రంలో అన్నిపార్టీలు మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధికసంఘం నిధులు మురిగిపోతాయన్న వాదనకు అంగీకరించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ నేతలు.. టికెట్ల కోసం క్యూ కట్టారు. పార్టీ కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న వారు, కీలక పదవులు దక్కనివారంతా స్ధానిక పోరులో అదృష్టం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

దాడుల మధ్యే నామినేషన్లు

దాడుల మధ్యే నామినేషన్లు

ఎన్నికల్లో ముందుగా వచ్చిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాలకు టికెట్లు సంపాదించడమే కాకుండా నామినేషన్లు వేసేందుకు వైసీపీ అభ్యర్ధులు సిద్ధమయ్యారు. అదే సమయంలో విపక్ష టీడీపీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురు కావడంతో ప్రభుత్వం, పోలీసుల మద్దతుతో నామినేషన్లు కూడా దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్ధులు పలుచోట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దం కావడంతో దాడులతో వారిని భయభ్రాంతులకు గురి చేయడం మొదలుపెట్టారు. చివరికి వైసీపీ అభ్యర్ధులదే పైచేయి అయింది. చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగిపోయాయి. దీంతో ఆయా అభ్యర్ధులంతా ఇవాళ హ్యాపీగా ఉన్నారు. కానీ టీడీపీ నామినేషన్లు వేసిన చోట మాత్రం ఎన్నికల వాయిదా నిర్ణయంతో వైసీపీ నేతలకు షాక్ తప్పడం లేదు.

సీటొస్తే అభ్యర్ధి గెలిచినట్లే...

సీటొస్తే అభ్యర్ధి గెలిచినట్లే...


అధికార పార్టీ కావడంతో సీటు తెచ్చుకుంటే చాలు ఇక గెలిచినట్లే అన్న ధీమా వైసీపీ అభ్యర్ధుల్లో కనిపించింది. దీంతో లక్షల రూపాయలు, కొన్ని చోట్ల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ టికెట్లు తెచ్చుకున్నారు. మరింత డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికల సామాగ్రిని సిద్దం చేసుకున్నారు. ప్రచారానికి వచ్చే వారికి డబ్బును కూడా రెడీ చేసేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఆరువారాల పాటు వాయిదా పడటంతో తెచ్చుకున్న డబ్బుకు వడ్డీలు కట్టుకుంటూ కాలక్షేపం చేయాల్సిన పరిస్ధితి. ఎన్నికల కోసం తెచ్చిన ప్రచార సామాగ్రిని దాచిపెట్టాలంటే గోడౌన్లు కూడా తప్పనిసరి. వీటి కోసం భారీగా ఖర్చుపెట్టిన వారంతా ఎన్నికల వాయిదాతో లబోదిబోమంటున్నారు.

సర్కారుపై పెరుగుతున్న ఒత్తిడి..

సర్కారుపై పెరుగుతున్న ఒత్తిడి..

స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటంతో ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని భావిస్తున్న వైసీపీ అభ్యర్ధులు అధిష్టానంపై అన్నివిధాలుగా ఒత్తిడి పెంచుతున్నారు. పలుచోట్ల తమకు పరిచయమున్న పార్టీ సీనియర్లు కనిపిస్తే చాలు తమ బాధల్ని మొరపెట్టుకుంటున్నారు. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో వైసీపీ పెద్దలు కూడా ఈ విషయాన్ని జగన్ వద్దకు తీసుకెళ్లి నేతల బాధలు ఏకరువుపెడుతున్నారు. దీంతో జగన్ కూడా న్యాయపోరాటంతో పాటు కేంద్రంలోని పెద్దల దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళదామని వారికి హామీలు ఇచ్చి పంపుతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

5 Minutes 10 Headlines || Coronavirus Updates || Madhya Pradesh Floor Test || Modi On COVID-19
రాజధాని తరలింపుపైనా ప్రభావం ..

రాజధాని తరలింపుపైనా ప్రభావం ..

ఏపీలో స్దానిక ఎన్నికల పోరు వాయిదా పడటంతో మే నెలలో రాజధానిని విశాఖకు తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలపైనా ప్రభావం పడబోతోంది. సచివాలయంలో ఉద్యోగులను ఏప్రిల్ నాటికి సిద్ధంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.. ఎన్నికల వాయిదా నేపథ్యంలో తదుపరి తేదీని ప్రకటిస్తామని వారికి సమాచారం ఇచ్చింది. అదే సమయంలో ఉద్యోగులు కూడా విశాఖ రాజధాని వెళ్లడంపై తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఈ బుధవారం సమావేశం కాబోతున్నారు. ఇందులో వారు కూడా ప్రభుత్వాన్ని క్లారిటీ కోరే అవకాశముంది.

English summary
ruling ysrcp's plans are in vain after postponement of local body elections in ap. ysrcp leaders looking frustrated after postponement of polls, most of them are also financially suffered after the annoucement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X