• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రకాశం జిల్లా తర్వాత వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ అక్కడే.. దాంతో టీడీపీ కథ దాదాపు క్లోజ్..?

|

ఏపీలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ తదుపరి టార్గెట్ అక్కడేనా ? ప్రకాశం జిల్లా తర్వాత వైసీపీ సీరియస్ గా దృష్టిపెట్టడం వెనుక కారణాలేంటి ? ఆ జిల్లాలో పట్టు సాధిస్తే ఇక టీడీపీకి పూర్తిగా చెక్ పెట్టేసినట్లేనా ? ఆ విధంగా చేస్తే వైసీపీ స్ధానిక ఎన్నికల సందర్భంగా పెట్టుకున్న లక్ష్యం కూడా నెరవేరుతుందా ?

ఇప్పుడు ఇవే ప్రశ్నలు సగటు వైసీపీ, టీడీపీ అభిమానుల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

వ్రతం చెడ్డా ఫలితం దక్కుతోందని టీడీపీ ఖుషీ.. ఏపీ స్ధానిక పోరులో చిత్రాలు..

స్ధానిక పోరు ఆపరేషన్ ఆకర్ష్..

స్ధానిక పోరు ఆపరేషన్ ఆకర్ష్..

ఏపీలో స్ధానిక పోరుకు ముందు వైసీపీలో నేతల చేరికలపై అసలు చర్చే లేదు. స్ధానిక పోరులో అధికార వైసీపీకి సహజంగానే కొంత ఎడ్జ్ ఉంటుందన్న అంచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎన్నికల నోటిపికేషన్ రాగానే పరిస్దితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి టీడీపీ నేతల ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సైతం వైసీపీవైపు చూడటం ప్రారంభించారు. అయితే ఓటర్లు ఎప్పుడెలా ఉంటారో అంచనా వేయడం కష్టంగా ఉండే కొన్ని జిల్లాలను ఎంచుకుని ముందుగా అక్కడే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో ముుందుగా గ్రేటర్ రాయలసీమగా భావించే సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫిరాయింపులకు వైసీపీ అదినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 సీమ తర్వాత అక్కడే ఆపరేషన్ ఆకర్ష్..

సీమ తర్వాత అక్కడే ఆపరేషన్ ఆకర్ష్..

రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ ఇప్పటికే పలువురు టీడీపీ కీలక నేతలను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న వైసీపీ, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం తమవైపు తిప్పుకోగలిగింది. దీంతో ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోయాయి. ఇప్పుడు వైసీపీ ఆపరేషన్ తదుపరి టార్గెట్ ఎక్కడనే అంశంపై చర్చ సాగుతోంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపీ కొత్త రాజధానిగా ఎంపికైన విశాఖ జిల్లాలో ఓ రేంజ్ లో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 విశాఖలోనే ఎందుకు?

విశాఖలోనే ఎందుకు?

ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక టీడీపీ ఎమ్మెల్యేలను కలిగిన జిల్లా విశాఖపట్నమే. అదీ విశాఖ నగరంలోనే టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ తూర్పున వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమాన గణబాబు, దక్షిణాన వాసుపల్లి గణేష్, ఉత్తరాన గంటా శ్రీనివాస్ రూపంలో నలుగురు ఎమ్యెల్యేలను టీడీపీ గెల్చుకుంది. అదీ వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని వీరంతా గెలిచారు. దీంతో రాష్ట్రాన్ని గెలిచినా విశాఖను గెలవలేకపోయామన్న ఆవేదన సీఎం జగన్ లో ఉండిపోయిందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ తదుపరి టార్గెట్ గా విశాఖను ఎంచుకున్నట్లు అర్దమవుతోంది.

విశాఖలో ఆపరేషన్ ఆకర్ష్ సాధ్యమేనా..!

విశాఖలో ఆపరేషన్ ఆకర్ష్ సాధ్యమేనా..!

ఏపీ కొత్త రాజధానిగా విశాఖ నగరం ఎంపికైన తర్వాత అక్కడ రాజకీయాలు వైసీపీకి కాస్త సానుకూలంగా మారాయి. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు నేతలపైనా ఒత్తిడి పెరుగుతోంది. అమరావతి మోజులో పడి విశాఖకు రాజధాని ఇస్తామంటే వ్యతిరేకిస్తున్న టీడీపీపై సహజంగానే అక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ పరిస్ధితిని తమకు సానుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. కొన్నిరోజులుగా విశాఖ నగరంలోనే పాగా వేసి స్ధానిక టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డి.. ఏ క్షణాన్నయినా వీరందరినీ తీసుకుని సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారనే ప్రచారం సాగుతోంది. అయితే నలుగురు ఎమ్మెల్యేలో కనీసం ఇద్దరు తమకు మద్దతిచ్చినా చాలని వైసీపీ అంచనా వేస్తోంది.

  Vijayawada Collector Imtiaz IAS Press Meet On Local Body Elections | Oneindia Telugu
   విశాఖ నుంచి వచ్చేదెవరు

  విశాఖ నుంచి వచ్చేదెవరు

  ఇప్పటికే పార్టీ రూరల్ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలోకి వచ్చే ఇతర నేతలతో కలిసి వైసీపీలోకి ఫిరాయించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. టీడీపీ రూరల్ అధ్యక్షుడిగా ఉంటూ, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన రమేష్ బాబు గతంలో ప్రజారాజ్యంలోనూ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో ఆయన బాస్, ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ కు వెళ్లి తిరిగి టీడీపీకి వచ్చారు. దీంతో పంచకర్లతో కలిసి గంటా కూడా ఈసారి వైసీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు స్ధానిక బీసీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా ఎట్టిపరిస్ధితుల్లోనూ వైసీపీ బాట పడతారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మిగతా ఇద్దరిలోనూ గణబాబుతో ప్రస్తుతం వైసీపీలో ఓ వర్గం మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నా.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

  English summary
  ysrcp's next operation akarsh target will be in visakhapatnam. ysrcp to encourage defections in vizag next. after prakasam, ysrcp focus on visakha mlas. ysrcp to "start operation akarsh" in vizag next.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more