వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావుల

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఅన్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం శాసనసభలో చేసిన ప్రకటన నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటన కలకలం రేపుతోంది. ఇక టీడీపీ సైతం వారెవరో చెప్పాలని ఎదురుదాడికి దిగింది . మైండ్ గేమ్ కు ఇక్కడ ఎవరూ భయపడరని పేర్కొంది.

టీడీపీ ఓటమిపాలై మూడు వారాలే .. అప్పుడే 100 చోట్ల దాడులు అని చంద్రబాబు ఆవేదనటీడీపీ ఓటమిపాలై మూడు వారాలే .. అప్పుడే 100 చోట్ల దాడులు అని చంద్రబాబు ఆవేదన

 టీడీపీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కోటం రెడ్డి సంచలనం

టీడీపీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కోటం రెడ్డి సంచలనం

ఇప్పటికే టీడీపీ అభద్రతా భావంలో ఉంటె కోటం రెడ్డి వ్యాఖ్యలు మరింత అభద్రతా భావానికి గురి చేస్తున్నాయి . ఇక కోటంరెడ్డి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా రెండు నెలల నుంచి తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు . ఇక వైసీపీకి టచ్ లో ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. వారి చేరికకి జగన్‌ సరే అంటే సాయంత్రమే కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారని ఆయన అన్నారు. అయితే వారంతా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ అడుగుతున్నారని చెప్పారు. వారి పేర్లు చెప్పటానికి నిరాకరించారు కోటం రెడ్డి .

పేర్లు చెప్పను కానీ టీడీపీలో భవిష్యత్ లేదనే వైసీపీ వైపు చూస్తున్నారన్న కోటం రెడ్డి

పేర్లు చెప్పను కానీ టీడీపీలో భవిష్యత్ లేదనే వైసీపీ వైపు చూస్తున్నారన్న కోటం రెడ్డి

ఇక తమ నియోజకవర్గాల్లో పనులు చేయాలని ఆ ఎమ్మెల్యేలు అడుగుతున్నారని కోటం రెడ్డి తెలిపారు. తనతో టచ్‌లో ఉన్నవారిలో ఒకరు నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యే అనిక్షేత్రస్థాయిలో పలువురు మంది టీడీపీ నేతలు వైసీపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పి టీడీపీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తించారు. తమ పార్టీలోకి వచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. టీడీపీకి భవిష్యత్‌ లేదని భావించే వారంతా జంప్ అవ్వాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు.

ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి .. మైండ్ గేమ్ లు వద్దు అన్న పయ్యావుల కేశవ్

ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి .. మైండ్ గేమ్ లు వద్దు అన్న పయ్యావుల కేశవ్


ఇక వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్తున్న వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్ ఖండించారు. తమతో టచ్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను వైసీపీ నేతలు బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరూ వైసీపీ ట్రాప్ లో పడొద్దని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని గతంలో జగన్ ప్రకటించిన సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని కేశవ్ గుర్తు చేశారు. జగన్ అలా ప్రకటించడం వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌‌గా ఆయన అభివర్ణించారు.. వైసీపీ నేతలతో టచ్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని పేర్లతో పాటు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
YSR Congress party MLA Kotamreddy Sridhar Reddy said eight Telugu Desam MLAs are in touch with them and if Jagan accepts, they are ready to take up YSRCP flag by evening. "In the last two months, TDP Rajya Sabha MP is in talks with us and since a few days, nearly 8 MLAs are willing to join YSRCP. If Jagan says yes, they will join the party by the end of the day," said Kotamreddy.However, Kotamreddy added that all the eight MLAs are asking ticket for the next elections from now which is something our party needs to decide. Nevertheless, Kotamreddy refused to reveal the names of MLAs who are in touch with him and added that at ground level, TDP leaders are looking at YSRCP and they opine that TDP has no future in Andhra Pradesh.In counter to YSRCP's claims TDP MLA Payyavula Keshav has dared Kotamreddy to reveal the names of the cycle party MLAs. He called this as Jagan and YSRCP's mind games and asked the TDP leaders not to fall in this trap.Criticising Governor's speech, Keshav said, there is no mention about development and capital city. This is not Governor's speech, it is all about 'Nava Ratnalu' speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X