వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును ఇరికించాలని చూశారు: మత్తయ్య, విచారణకు వైసీపీ డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య అప్రూవర్‌గా మారితే ఏం జరగనుందనే చర్చ సాగుతోంది. మత్తయ్య ఏం చెబుతారు, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత.. అనే విషయాలను కుండబద్దలు కొట్టనున్నారా? చూడాలి.

చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: 'ఇద్దరూ ఒక్కటయ్యారు,నలిగిపోతున్నా', అసలేం జరిగింది?

తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని జెరూసలేం మత్తయ్య అన్నారు. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న మత్తయ్య ఎవరి పేర్లు చెబుతారో తేలాల్సి ఉంది.

చదవండి: చంపించారు, నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా! నేనొక్కడినే వస్తా: జగన్‌పై ఆదినారాయణ

చదవండి: జగన్‌ను పార్టీ పెట్టనిచ్చేవాడుకాదు, బాబుకు ముందే తెలుస్తుంది, బలహీనత అదే: కేవీపీ

చంద్రబాబును ఇరికించాలని చూశారు

చంద్రబాబును ఇరికించాలని చూశారు

ఓటుకు నోటు కేసులో తనకు సంబంధం లేకున్నప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తనను ఉపయోగించుకోవాలని మత్తయ్య రెండు రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో తనను సాక్షిగా ఉపయోగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఇరికించాలని చూశారన్నారు.

ఓటుకు నోటుతో పాటు ఫోన్ ట్యాపింగ్

ఓటుకు నోటుతో పాటు ఫోన్ ట్యాపింగ్

వారి మాట వినలేదని మంత్రి కేటీఆర్, ఆయన గన్‌మెన్‌లు తనను బెదిరించారని కూడా మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై సీబీఐ దర్యాఫ్తుకు అనుమతివ్వాలన్నారు.

సీబీఐకి అప్పగించాలని వైయస్సార్సీపీ

సీబీఐకి అప్పగించాలని వైయస్సార్సీపీ

ఓటుకు నోటు కేసును సిబిఐతో విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఈ కేసులో ఆరోపణలు వచ్చాయని, మత్తయ్య అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కేసును అత్యున్నత దర్యాఫ్తు సంస్థకు అప్పగించాలన్నారు.

న్యాయం జరుగుతుంది

న్యాయం జరుగుతుంది

తమకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ముందో, వెనుకో న్యాయం గెలుస్తుందన్నారు. ఈ కేసుల కారణంగానే చంద్రబాబు అటు కేంద్రంతో, ఇటు తెలంగాణతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటంలో విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.

English summary
YSR Congress Party chief whip in Parliament Y.V. Subba Reddy on Saturday demanded a probe by the CBI into cash-for-vote scam under the direct supervision of the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X