వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ గెలుపు సులభం కాదు - సొంత పార్టీ నేతల అనుమానం : సీఎం జగన్ లక్ష్యానికి భిన్నంగా..!!

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేం. కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగరాలి. ఇదీ.. పదే పదే పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చెబుతున్న మాటలు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఒక వైపు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని చెబుతున్న సమయంలో..వైసీపీలోని సీనియర్ నేతలు సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు వైసీపీలో కలకలంగా మారుతోంది.

రామచంద్రయ్య వ్యాఖ్యలతో

రామచంద్రయ్య వ్యాఖ్యలతో

సీనియర్ నేత సీ రామచంద్రయ్య రాయచోటి పార్టీ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ రోజున పెద్ద యుద్దమే జరుగుతుందని వ్యాఖ్యానించారు. పార్టీ గెలవటం అంత సులభమేమీ కాదంటూ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో నాయకులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నమ్మకం కలిగించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువయ్యారని..వారి కోర్కెలు అదే స్థాయిలో పెరగటం వలన ఎవరూ తీర్చలేరంటూ వ్యాఖ్యానించారు. ఆత్మకూరు ఎన్నికల ఫలితాల వెల్లడి రోజున సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సైతం వైసీపీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొరపాట్లు ఉన్నాయని వాటిని సరి చేసుకుంటే..జగన్ కు తిరుగు లేదని చెప్పుకొచ్చారు.

నేతల ఓపెన్ కామెంట్స్ వెనుక

నేతల ఓపెన్ కామెంట్స్ వెనుక

ఇదే సమయంలో పార్టీలోని సీనియర్ నేతలు కొందరు బహిరంగంగా చేసుకుంటున్న విమర్శలు .. జిల్లాల్లో ఆధిపత్య పోరు మొత్తంగా ప్రతిపక్షానికి ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశంలో మాజీ మంత్రి బాలినేని టీడీపీ తో కలిసి తమ పార్టీలోని సీనియర్ నేత కుట్ర చేస్తున్నారంటూ కామెంట్ చేసారు. అదే జిల్లాలో దర్శి ఎమ్మెల్యే సీఎం జగన్ బటన్ నొక్కితే ఆయన మైలేజ్ పెరుగుతుంది కానీ, తమకు కాదన్నారు. గ్రామాల్లో రోడ్లు వేస్తే తమ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. పనులు చేసిన వారికి కోట్లాది రూపాయాల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందంటూ చెప్పుకొచ్చారు. బాలినేని చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రడ్డి సైతం మద్దతు పలికారు. సొంత పార్టీలో నేతల తీరు పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
సీఎం జగన్ ఏం చేయబోతున్నారు

సీఎం జగన్ ఏం చేయబోతున్నారు


ఇక, గన్నవరం.. విశాఖ దక్షిణ.. చీరాల వంటి నియోజకవర్గాల్లో అసమ్మతి రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు అసలు అధికారంలోకి వస్తామనే విషయంలో వైసీపీ నేతల్లోనే సందేహాలు - అనుమానాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. నమ్మకం లేక చెబుతున్నా.. పార్టీ శ్రేణుల్లో అతి విశ్వాసానికి అవకాశం లేకుండా ముందస్తుగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక, మరి కొద్ది రోజుల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ వేదికగా 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు - కీలక అంశాల ప్రకటనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో..ఇప్పుడు పార్టీలోని సీనియర్లు - ముఖ్యులు చేస్తున్న వ్యాఖ్యలు - ఓపెన్ కామెంట్స్ వ్యవహారం వైసీపీలో చర్చకు కారణమవుతోంది. దీనికి సీఎం జగన్ ఎటువంటి క్లారిటీతో ముగింపు ఇస్తారనేది చూడాలి.

English summary
YSRCP senior leaders comments on party winning chances in up coming elections lead to new congtroversy in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X