• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనం

|

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అంశంపై అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ల మధ్య కొనసాగుతోన్న వాగ్వాదం తారాస్థాయికి చేరింది. బుధవారం నాటి అఖిలపక్షం భేటీకి హాజరు కాబోమంటూ వైసీపీ ఇచ్చిన ప్రెస్ నోట్ చూసి ఆశ్చర్యపోయానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యాఖ్యానించగా.. ప్రస్తుతం ఏపీలో ఉన్నది ఎస్ఈసీ కాదని, చంద్రబాబు-నిమ్మగడ్డల కమిషన్ అని వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడియన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి ఏమన్నారో ఆయన మాటల్లోనే..

కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?

టీడీపీకి తాకట్టు పెట్టారు..

టీడీపీకి తాకట్టు పెట్టారు..

‘‘రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) బుధవారం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి స్థానిక ఎన్నికలపై అభిప్రాయాలు తీసుకుంది. ఆ భేటీని వైసీపీ బహిష్కరిస్తున్నదని మేం ముందుగానే స్పష్టం చేశాం. ఈసీ విడుదల చేసిన నోట్‌ పై మేము చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపర్చాయని నిమ్మగడ్డ అంటున్నారు. అసలు ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే.. రాజ్యాంగ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి గల ఎస్ఈసీని నిమ్మగడ్డ రమేశ్ టీడీపీకి తాకట్టుపెట్టారు. ఇవే ఎన్నికలను వాయిదా వేసిన సందర్భంలో(మార్చిలో) ఆయన అన్ని పార్టీలను అడిగారా? కనీసం ప్రభుత్వం నుంచి వివరణ కోరారా? కుట్ర పూరితంగా టీడీపీతో కలిసి నాడు ఎన్నికలను వాయిదా వేశారు. నిజానికి..

నిమ్మగడ్డతో ఢీ: జగన్‌కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామనిమ్మగడ్డతో ఢీ: జగన్‌కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామ

చంద్రబాబు లేఖపై సంతం చేశారే..

చంద్రబాబు లేఖపై సంతం చేశారే..

స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటప్పుడు నిమ్మగడ్డ.. రాజకీయ పక్షాలతో మాట్లాడే ముందైనా ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదు? ఆనాడు మూడు కేసులు ఉంటేనే ఎన్నికలు వాయిదా వేశారే.. ఇవాళ రోజుకు 3వేల కొత్త కేసులు వస్తుండగా ఎన్నికలు ఎలా సాధ్యం? ఎవరి మాట విని అర్థాంతరంగా ఎన్నికలు వాయిదా వేశారు? చంద్రబాబు ఆదేశంతో టీడీపీ ఆఫీసులో తయారైన లేఖపై సంతకం చేసిందెవరు? ఎస్ఈసీని చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా మార్చేసింది ఎవరు? మరో సంచలన విషయం ఏంటంటే..

ఆర్టినెన్స్‌పై అవాకులు గుర్తుందా?

ఆర్టినెన్స్‌పై అవాకులు గుర్తుందా?

ఎన్నికల వాయిదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తాను రాసిన లేఖ నిమ్మగడ్డకు గుర్తుందా? ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడానికి జగన్ సర్కారు ఆర్టినెన్స్ తీసుకొస్తే దానిపై ఎన్నేసి మాటలన్నారో మర్చిపోయారా? చంద్రబాబు రాసిన లేఖపై సంతకం చేసిన నిమ్మగడ్డ.. ఆనాడు రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం ఎందుకు జరపలేదు? తర్వాతి కాలంలో ఓ హోటల్ లో రహస్యంగా టీడీపీ నేతలతో కుమ్మక్కు రాజకీయాలు నెరిపింది నిమ్మగడ్డ కాదా? ఎస్ఈసీ హోదాలో ఉంటూ టీడీపీతో కుమ్మక్కై నిమ్మగడ్డ వ్యవహరిస్తోన్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది.

  Nimmagadda Ramesh Kumar Case Coming To Hearing On June 10 In Supreme Court
  ఎప్పుడైనా గెలిచేది వైసీపీనే..

  ఎప్పుడైనా గెలిచేది వైసీపీనే..

  ఒక పార్టీకి కొమ్ముకాస్తోన్న వ్యక్తి ఎస్ఈసీగా ఉండి ప్రక్రియ నిర్వహించడాన్నే మేం తప్పుపడుతున్నాం కానీ, ఎన్నికలకు వైసీపీ ఏనాడూ భయపడదు. ఏపీలో ప్రజాబలం కలిగిన ఏకైక పార్టీ మాదొక్కటే. ప్రస్తుతం కరోనా కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ, రెండో దశ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలున్నాయి. అందుచేత కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఒకే చెబుతుందని భావిస్తున్నా'' అని అంబటి రాంబాబు అన్నారు.

  English summary
  ysrcp official spokesperson, sattenapalli mla ambati rambabu made sensational remarks on state election commissioner nimmagadda ramesh kumar. speaking to media on wednesday, ambati allegges that nimmagadda is purely acting in favour of tdp chief chandrababu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X