• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామరాజు పై అనర్హత వేటు వేయండి : స్పీకర్ వైసీపీ ఫిర్యాదు: జగన్ వెళ్లగానే..ఈ సారి పక్కానా...!!

By Lekhaka
|

వైసీపీలో రెబల్ ఎంపీ రఘురామ రాజు పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పీకర్ ను కోరింది. ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. రఘురామ రాజు పైన గతంలోనే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ కు ఆధారాలు ఇచ్చామని భరత్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ ను కోరారు.

జగన్ పర్యటన పూర్త కాగానే ఫిర్యాదు..

జగన్ పర్యటన పూర్త కాగానే ఫిర్యాదు..

కొంత కాలంగా రఘురామ రాజు ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో..ఆయన పైన ఏపీ సీఐడి సుమోటాగా కేసు నమోదు చేసింది. రాజద్రోహం కింద సెక్షన్లు నమోదు చేసింది. సీఐడి అరెస్ట్ చేసిన సమయంలో తనను హింసించారని..గాయపరిచారని రఘురామ రాజు సీఐడి కోర్టులో ఫిర్యాదు చేసారు. ఇక, సుప్రీంకోర్టులో కండీషనల్ బెయిల్ పొంది..ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. అక్కడి నుండే పలువురి కి తన పైన దాడి జరిగిందంటూ లేఖలు రాసారు. కేంద్ర మంత్రులు..గవర్నర్లు..ముఖ్యమంత్రులు..ఎంపీలకు వరుసగా లేఖలు రాసారు. కొందరు ఎంపీలు స్పందించారు. దీంతో..ఇప్పటి వరకు ఈ విషయం పైన ఏ రకంగానూ స్పందించని వైసీపీ అధినాయకత్వం ఢిల్లీ కేంద్రంగా పావులు కదిపినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అధికారిక అజెండాతో పాటుగా..పొలిటికల్ అజెండాలో భాగంగా ఈ అంశం పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

 ముఖ్యమంత్రి సైలెంట్ ఆపరేషన్..

ముఖ్యమంత్రి సైలెంట్ ఆపరేషన్..

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో చేసిన ఆపరేషన్ లో భాగంగానే...ఆయన ఢిల్లీ నుండి అమరావతికి పయనం కాగానే పార్టీ విప్ నేరుగా స్పీకర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసారు. దీంతో ఈ సారి ఫిర్యాదు పైన ఖచ్చితంగా స్పందన ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ రఘురామ రాజు ను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవటానికి కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. ఆయన పైన అనర్హత వేటు వేయటం ద్వారా ఆయన ఎంపీ పదవి కోల్పోతారని...ముందుగా సస్పెండ్ చేస్తే తమ నియంత్రణ ఉండదని వారు విశ్లేషిస్తున్నారు.

 చర్యలు ఈ సారి ఖాయమంటూ..

చర్యలు ఈ సారి ఖాయమంటూ..


అందులో భాగంగానే రఘురామ రాజు ఏం మాట్లాడినా పార్టీ నుండి అధికారికంగా స్పందన ఉండటం లేదనేది మరో వాదన. ఇందులో భాగంగానే ఇప్పుడు మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు కనిపిస్తోంది. ఇక, ఈ ఫిర్యాదు పైన స్పీకర్ ముందుగా నోటీసులు ఇస్తారా..రఘురామ రాజును వివరణ కోరుతారా..లేక నేరుగా చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా స్పీకర్ తన వద్దకు వచ్చిన ఫిర్యాదు మీద స్పందిచాల్సి ఉంటుందని.. చర్యలు ఉంటాయని ధీమాగా చెబుతున్నారు.

English summary
YSRCP once again filed a petition seeking the disqualification of rebel MP Raghuramaraju
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X