వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ అవిశ్వాసానికి వైసీపీ మద్దతు: తెలంగాణ ఎంపీకి విప్, ఆ ఇద్దరిపై సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: పార్టీ మారిన ఎంపీలకు విప్ జారీపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణలో మల్కాజిగిరి నుంచి 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ మల్లారెడ్డి ఆ తర్వాత తెరాసలో చేరారు. ఆయనకు టీడీపీ విప్ జారీ చేసింది. అవిశ్వాసానికి తాను అనుకూలంగా ఓటు వేస్తానని మల్లారెడ్డి చెప్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విప్ జారీ కాలేదు. అవిశ్వాసంపై ఏపీకి చెందిన కొత్తపల్లి గీత, తెలంగాణకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల తీరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. వారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత పొంగులేటి తెరాసలో చేరారు. కొత్తపల్లి గీత ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. వీరుద్దరు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తారని భావిస్తున్నారు.

దెబ్బకు 4 పిట్టలా, సెల్ఫ్ గోలా? పవన్ ఆయుధంతో ఆయనే టార్గెట్, జగన్‌కు ఛాన్స్ మిస్దెబ్బకు 4 పిట్టలా, సెల్ఫ్ గోలా? పవన్ ఆయుధంతో ఆయనే టార్గెట్, జగన్‌కు ఛాన్స్ మిస్

YSRCP to support No Confidence Motion

మరోవైపు, అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో ఉన్నారు. ఓటింగ్‌కు రావాలని ఆయనను టీడీపీ కోరింది. తాను ఓటింగులో పాల్గొంటానని ఎస్పీవై రెడ్డి స్పష్టం చేశారు. రేపటి అవిశ్వాసంపై అందరి దృష్టి ఉంది.

English summary
YSR Congress Party will support Telugudesam Party No Confidence Motion in Parliament on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X