కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

కడప: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందా? గ్రామ వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు నిజమౌతున్నాయా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఈ పథకం వల్ల లబ్ది పొందారా? అంటే అవుననే ఆక్రోశిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్తలు. పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు పంగనామాలు పెట్టారంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన ఇంటి వద్ద బైఠాయించి, తమ నిరసన వ్యక్తం చేశారు.

Big Boss 3: పవన్ పరువు తీస్తుందా ఆ అమ్మాయి? గతంలో జరిగిందేంటీ..ఇప్పుడేంటీ?Big Boss 3: పవన్ పరువు తీస్తుందా ఆ అమ్మాయి? గతంలో జరిగిందేంటీ..ఇప్పుడేంటీ?

కడపలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రానాథ్ రెడ్డి లక్షల రూపాయలకు గ్రామ వలంటీర్ల పోస్టులను తెలుగుదేశం వారికి అమ్ముకున్నారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీ వీరశివారెడ్డి సిఫారసు చేసిన వారికే నియామక పత్రాలు అందజేశారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ. వైఎస్ జగన్ పేరును అడ్డుగా పెట్టుకుని చివరికి గ్రామ వలంటీర్ల పోస్టులను కూడా తమకు కాకుండా చేశారని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి న్యాయం చెయ్యలని వారు కోరుకుంటున్నారు.

YSRCP Supporters and Workers was agitate in front of the Own Party MLAs house in Kadapa District

గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల నియామకానికి తాము సిఫారసు చేసిన వారిని వలంటీర్లుగా ఎందుకు నియమించలేదంటూ వారు ఏకంగా ఎమ్మెల్యేలు, అధికారులపైనే విరుచుకుపడుతున్నారు. కడపలో రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటి వద్ద ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌ సర్దిచెప్పినా వినిపించుకోలేదు. ఇదే పరిస్థితి ప్రొద్దుటూరులోనూ చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్‌ గంగా ప్రసాద్‌ను టార్గెట్‌ చేసుకుని వైఎస్ఆర్ సీపీ మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకులు ఆందోళనలు చేపట్టారు. తామిచ్చిన జాబితా మేరకు వలంటీర్లకు అర్హత పత్రాలివ్వకపోవడాన్ని నిలదీశారు. మైదుకూరు నియోజకవర్గంలోనూ

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy's Uncle and YSR Congress Party MLA Ravindranath Reddy from Kamalapuram in Kadapa District is now facing heat from his own Party Workers and Supporters in the row of filling of Village volunteers Posts in the State. YSRCP Supporters were alleged that Ravindranath Reddy sold out the Posts to rival party Telugu Desam as laks of Rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X