గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ను అరెస్టు చేయండి: గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ ను అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అర్బన్ పోలీసు సూపరింటెండెంట్ కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ఒకరు వైఎస్ జగన్, అనిల్ కుమార్ యాదవ్ లను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేశారని పేర్కొన్నారు. పైగా- రైతునని చెప్పుకొంటూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలను మోసగించిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గుంటూరు రూరల్ మండలం బొంతపాడు గ్రామానికి చెందిన దారం అశోక్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు.

<strong>కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని మీడియాపై చూపిస్తోన్న రాహుల్ గాంధీ!</strong>కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని మీడియాపై చూపిస్తోన్న రాహుల్ గాంధీ!

టీడీపీ డబ్బులు ఇచ్చి నియమించుకున్న ఓ వ్యక్తి.. తనను తాను రైతుగా చెప్పుకొని ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను కించపరిచేలా వ్యాఖ్యానించారని అన్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ అయిన ఆ వ్యక్తి చేసిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా గ్రూపులలో విస్తృతంగా ప్రచారం చేస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో కనిపించిన వ్యక్తి ముఖ్యమంత్రిని వెదవ అని సంబోదించారని, భారీ నీరు పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కులం పేరుతో దూషించాడని అన్నారు. యాదవుల కులవృత్తిని కించపర్చేలా మాట్లాడారని చెప్పారు. యాదవ కులస్తులను మనోభావాలను దెబ్బతీశాడని పేర్కొన్నారు.

YSRCP Supporters gave complaint on Telugu Desam Party Social media worker

ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా ఉన్నాడని అన్నారు. తెలుగుదేశం అధికారికంగా రూపొందించిన వీడియోల ఈ విషయం స్పష్టమైందని అశోక్ కుమార్ యాదవ్ చెప్పారు. వైఎస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని, అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా ప్రోత్సాహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న మాజీమంత్రి నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న నారా లోకేష్.. ఇలా చవకబాబు ట్రిక్కులను ప్రయోగించడం సరికాదని అశోక్ కుమార్ యాదవ్ అన్నారు.

English summary
YSR Congress Party Guntur Distrct Social media wing leaders gave a complaint against Telugu Desam Party General Secretary and former minister Nara Lokesh and leaders from the same party. YSRCP Social media wing leaders gave a complaint to Guntur District Urban Police Superintendent. They mentioned in the complaint that..some paid artist acted a farmer's mask and abuse the Chief Minister YS Jaganmohan Reddy and Irrigation Minister P Anil Kumar Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X