వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దివిస్ టెన్షన్: బాబుపై ఫైట్, వైసిపి మద్దతు, ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

కాకినాడ: దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా సిపిఎం మంగళవారం నాడు బహిరంగ సభకు పిలుపునివ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలోని పంపాదిపేట, కొత్తపాకలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సెక్షన్ 144 అమలు చేశారు.

సిపిఎం బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు పలువురిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. సిపిఎం సకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. దీంతో ఆయనతో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు.

YSRCP supports CPM meeting in East Godavari

దివిస్ పరిశ్రమకు భూసేకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం మంగళవారం నాడు బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు హాజరు కానున్నారు. ఈ సభకు వైసిపి, సీపీఐతో పాటు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు పలికాయి.

బహిరంగ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించారని ప్రభుత్వం చెబుతోందని, అందులో వాస్తవం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.

కాగా, ఇప్పటికే ప్రత్యేక హోదా, రాజధాని అమరావతికి భూసేకరణ, కాపు రిజర్వేషన్లు.. ఇలా పలు అంశాల పైన చంద్రబాబు ప్రభుత్వం పై ఉద్యమిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జిల్లాలో దివిస్ పరిశ్రమ ద్వారా టీడీపీని టార్గెట్ చేస్తోంది.

English summary
YSRCP supports CPM public meeting in East Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X