వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమిలికి షరతులతో వైసీపీ మద్దతు, రాజ్యసభ 'డిప్యూటీ' ఎన్నికల్లో బీజేపీకి షాక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు వైసీపీ షరతులతో కూడిన మద్దతిచ్చింది. జమిలితో జాతీయ పార్టీలకు లాభమని, ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినకుండా స్పష్టమైన భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాలన్నారు.

క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్‌తో పవన్క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్‌తో పవన్

ముందుగా లోకసభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని లా కమిషన్‌ను అడిగామని, రద్దయిన కాలానికే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని తెలిపారు. దేశ, ఏపీ ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యా జమిలికి వైసీపీ మద్దతిస్తోందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయ సాధన చేయాలని కోరారు.

ఏపీలో జమిలి కొత్త కాదు

ఏపీలో జమిలి కొత్త కాదు

ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటుతో పాటు శాసనసభకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళవారం అన్నారు. జమిలి ఎన్నికలపై వైసీపీ నేతలు లా కమిషన్‌ను కలిశారు. జమిలికి అభ్యంతరం లేదని తెలిపారు. అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. జమిలికి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిపారు.

తొమ్మిది పేజీల లేఖ

తొమ్మిది పేజీల లేఖ

జమిలి ఎన్నికల కారణంగా ఏపీపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. జమిలికి అభ్యంతరం లేదని చెప్పారు. ఉమ్మడి ఎన్నికలను మేం సమర్థిస్తున్నామని చెప్పారు. ఇందుకు రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరముందని తెలిపారు. లా కమిషన్‌కు వైసీపీ 9 పేజీల లేఖ రాసింది. షరతులతో కూడిన జమిలికి మద్దతు తెలిపింది.

ఫిరాయింపుదారుల అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోకి

ఫిరాయింపుదారుల అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోకి

అలాగే, ఫిరాయింపుల పరిధిని స్పీకర్ పరిధి నుంచి తప్పించాలని విజయ సాయి రెడ్డి డిమాండ్ చేశారు. అనర్హత నియామకాన్ని ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలన్నారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారని చెప్పారు. కానీపై వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఒక్కో ప్రజాప్రతినిధికు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

 చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాము హోదా కోసం పోరాడుతున్నామని చెప్పారు. చంద్రబాబు నయవంచకుడు, నమ్మకద్రోహి, కుట్రదారుడు అన్నారు. చంద్రబాబు దగుల్బాజీ ముఖ్యమంత్రి అని, ఓ ఫ్రాడ్ అని, చీటర్ అని చెప్పారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2004లో ముందస్తు ఎన్నికలు ఎందుకు కోరుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఈ మధ్య మెదడు తల నుంచి మోకాలులోకి వచ్చిందని విజయసాయి అన్నారు. ఇది (జమిలి) మోడీ ప్రపోజల్ కాదని చెప్పారు. దేశం కోసం తాము దీనికి మద్దతిస్తున్నామని చెప్పారు.స్వప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్లారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపడతామని, బాబు జైలు కెళ్లడం ఖాయమని, రాజ్యాంగానికి చంద్రబాబు హానికరమైన వ్యక్తి అని మండిపడ్డారు.

బీజేపీకి షాక్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతు లేదు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తాము బీజేపీకి మద్దతు ఇవ్వదల్చుకోలేదని విజయ సాయి రెడ్డి చెప్పారు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలకు కూడా మద్దతివ్వమని చెప్పారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఏపీని మోసం చేసిందన్నారు. అందుకే ఆ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి మాట్లాడుతూ.. తాను చెప్పిన వ్యాఖ్యలు యథావిధిగా లైవ్ టెలికాస్ట్ చేస్తారని తాను నమ్మడం లేదని, వారు తన నమ్మకాన్ని వమ్ము చేస్తే మంచిదని చెప్పారు.

English summary
YSRCP supports simultaneous elections with conditions. YSRCP MP Vijaya Sai Reddy and other leaders on Tuesday met Law Commitssion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X