వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూట్ మార్చిన జగన్: గెలుపు కోసం ఆ ప్రయత్నం కూడా!, ఫలిస్తుందా?

జగన్ సీఎం కావాలని కోరుతూ మలక్‌ పేటలోని వేద పండితుడు శివరామ ప్రసాదశర్మ నివాసంలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం యాగాన్ని ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: 2019ఎన్నికలే టార్గెట్‌గా అన్నీ తనకు అనుకూలంగా ఉండేలా సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. రాజకీయంగా వ్యూహాస్త్రాలు సిద్దం చేస్తూనే.. దైవాన్ని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే 'శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం'ను ఆ పార్టీ ప్రారంభించింది.

జగన్ సీఎం కావాలని కోరుతూ మలక్‌ పేటలోని వేద పండితుడు శివరామ ప్రసాదశర్మ నివాసంలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం యాగాన్ని ప్రారంభించారు. 2019ఎన్నికల క్రతువు ముగిసేదాకా ఈ యాగం కొనసాగుతుందని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గరపడే లోగా.. వీలు చూసుకుని జగన్ ఒకరోజు ఈ యాగంలో పాల్గొననున్నారు.

YSRCP takes yagam route to topple Naidu!

వైసీపీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక పూర్ణాహుతికి కూడా జగన్ హాజరవుతారని పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. మొత్తానికి అటు రాజకీయ పావులు కదుపుతూనే.. ఇటు శాస్త్రోక్తంగాను తన విజయానికి ఏ దోషమూ అడ్డురాకుండా చూసుకుంటున్నారు జగన్. ప్రశాంత్ కిశోర్ సలహాలు.. బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలతో భవిష్యత్తు ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీకి ఈ యాగం ఎంతమేర దోహదపడుతుందో మరి!

English summary
YSR Congress Party leaders have hit upon a new idea to catapult their party president Y S Jaganmohan Reddy into the seat of power in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X