అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య నాదెళ్ల నుంచి పీవీ సింధు వరకు: బాబును అలా టార్గెట్ చేస్తున్న జగన్

సత్య నాదెళ్ల, సైబరాబాద్, పీవీ సింధులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలోనే మైక్రోసాఫ్ట్ అంశంతో చంద్రబాబును ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సత్య నాదెళ్ల, సైబరాబాద్, పీవీ సింధులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలోనే మైక్రోసాఫ్ట్ అంశంతో చంద్రబాబును ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు.

హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు పదేపదే చెబతుంటారు. ఇందులో వాస్తవం ఉంది. కానీ స్వయంగా ఆయన నిత్యం చెబుతుండటంతో పలుచన అవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

బాబూ! రాజీనామా చెయ్, ఓటుకు నోటులో 48సార్లు నీ పేరు, కేసీఆర్‌తో లాలూచీ'బాబూ! రాజీనామా చెయ్, ఓటుకు నోటులో 48సార్లు నీ పేరు, కేసీఆర్‌తో లాలూచీ'

సొంత డబ్బా అని బుగ్గన ఎద్దేవా

సొంత డబ్బా అని బుగ్గన ఎద్దేవా

సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఎద్దేవా చేశారు. సత్య నాదెళ్లను తానే మైక్రోసాఫ్ట్ రంగాన్ని ఎంచుకోమని చెప్పానని, ఇక పీవీ సింధు తన వల్లే ఒలింపిక్స్‌లో పతకం సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

జగన్ నుంచి రోజా దాకా..

జగన్ నుంచి రోజా దాకా..

జగన్ నుంచి రోజా దాకా వైసిపి నేతలు.. చంద్రబాబు చేసే సొంత డబ్బా వ్యాఖ్యలపై చురకలు అంటిస్తున్నారు. మంగళవారం నాడు అసెంబ్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ట్రంప్-బాబు పేరుతో భయమని...

ట్రంప్-బాబు పేరుతో భయమని...

డొనాల్డ్ ట్రంప్ పేరు చెబితే భారతీయులు భయపడుతున్నట్లుగా, చంద్రబాబు పేరు చెబితే మైక్రోసాఫ్ట్ సహా పలు సంస్థలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పత్రిక సాక్షి... 'బాబు బండారం బయటపెట్టిన సత్య నాదెళ్ల' అంటూ కథనం రాసింది.

బండారం బయటపెట్టిందని..

బండారం బయటపెట్టిందని..

చంద్రబాబు మైక్రోసాఫ్ట్ వస్తుందని చెప్పగా, సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న గూగుల్ రావడం లేదని చెప్పిందని, తద్వారా ఏపీ సీఎం బండారాన్ని ఆయన బయటపెట్టారని అభిప్రాయపడింది.

సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తి అని చంద్రబాబు గొప్పలు చెబుతారని, తన వల్లే అతను మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడని చెబుతారని జగన్ సభలో ఎద్దేవా చేశారు.

బాబుకు షాకిచ్చారని..

బాబుకు షాకిచ్చారని..

ఇంకా మాట్లాడుతూ.. 11వ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రం స్థాపించేందుకు సత్య నాదెళ్ల అంగీకరించారని చంద్రబాబు చేసిన ప్రకటన అక్టోబర్ 21న పత్రికల్లో వచ్చిందని, కానీ ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల.. తాము రావడం లేదని, కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారని జగన్ చెప్పారు. ఎన్సీఏఈఆర్ రిపోర్టులో ఏపీ అవినీతిలో నెంబర్ 1గా ఉందని, అందుకే మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు వణికిపోతున్నాయన్నారు.

English summary
YSR Congress Party leaders targetting AP CM Chandrababu Naidu for his comments on Hyderabad and Satya Nadella.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X