అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యనమల షాక్: 'అమరావతిపై కుట్ర, వరల్డ్ బ్యాంకుకు వైసిపి మెయిల్స్'

వైసిపిపై, ఆ పార్టీ అధినేత జగన్‌పై మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అమరావతికి రుణం అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు తప్పుడు మెయిల్స్ పెట్టారని సంచలన ఆరోపణ చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌పై మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతికి రుణం అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు తప్పుడు మెయిల్స్ పెట్టారని సంచలన ఆరోపణ చేశారు.

'ఫోటో' దెబ్బ: విజయసాయికి కూడా జగన్ పక్కన కూర్చునే అర్హత లేదా?'ఫోటో' దెబ్బ: విజయసాయికి కూడా జగన్ పక్కన కూర్చునే అర్హత లేదా?

ప్రపంచ బ్యాంకుకు తప్పుడు మెయిల్స్ పెట్టి, రాజధాని అమరావతికి రుణం అడ్డుకోవడం దారుణమని వైసిపిపై నిప్పులు చెరిగారు. గతంలో గ్రీన్ ట్రైబ్యునల్‌కు కూడా వెళ్లారని తెలిపారు. కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారన్నారు.

రాజధాని నిర్మాణం అడ్డుకునేందుకు..

రాజధాని నిర్మాణం అడ్డుకునేందుకు..

రాజధాని నిర్మాణం అడ్డుకునేందుకు వైసిపి అన్ని ప్రయత్నాలు చేస్తోందని యనమల మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా రుణాలు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకే ఫిర్యాదు మెయిల్స్ పెట్టడం దారుణం అన్నారు.

అప్పుడు విదేశీ మంత్రులు రాకుండా..

అప్పుడు విదేశీ మంత్రులు రాకుండా..

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన సమయంలో విదేశీ మంత్రులు రాకుండా మెయిల్స్ పంపించారని యనమల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు అమరావతి నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

జగన్ ఓర్వలేకపోతున్నారని దేవినేని

జగన్ ఓర్వలేకపోతున్నారని దేవినేని

పట్టిసీమ నీరు కృష్ణా డెల్టా రైతులను బతికించిందని, ఆ నీరు ఇక్కడకు వస్తే వైసిపి అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. కడుపు మంటతో పట్టిసీమపై జగన్ విషం కక్కుతున్నారన్నారు.

జగన్ కుప్పిగంతులు...

జగన్ కుప్పిగంతులు...

పట్టిసీమ ద్వారా 6,018 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి వచ్చాయని దేవినేని వివరించారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆయన చేసిన పాపాలు పోవని చెప్పారు.

English summary
Andhra Pradesh Minister Yanamala Ramakrishnudu on Tuesday alleged that YSRCP is trying to stall world bank funds to Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X