వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరకట్టపై టీడీపీ, వైసీపీ బీసీ వార్-జగన్ ప్లాన్ కు చంద్రబాబు కౌంటర్-టీ కప్పులో తుఫాన్ చల్లారిందిలా..

|
Google Oneindia TeluguNews

కుల సమీకరణాలకు పెట్టింది పేరైన ఏపీలో నిత్యం రావణకాష్టం రగులుతూనే ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీల్ని ఆకట్టుకునేందుకు, ప్రత్యర్ధుల్ని దూరం చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని తవ్వుతూనే ఉంటాయి. ఇదే క్రమంలో తాజాగా సీఎం జగన్ పై బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వేసిన పంచ్ లకు చంద్రబాబు ఇంటి ముందు వైసీపీ జోగి రమేష్ నిరసన రూపంలో కౌంటర్ ఇప్పించే ప్రయత్నం చేసింది. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత కూడా మరో బీసీ నేత బుద్ధా వెంకన్నను రంగంలోకి దింపి తెరదించారు.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

బీసీల కోసం టీడీపీ, వైసీపీ వార్

బీసీల కోసం టీడీపీ, వైసీపీ వార్

ఏపీ జనాభాలో ఎక్కువగా ఉండే బీసీల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుుడూ ఏదో ఒక రాజకీయం చేస్తూనే ఉంటాయి. దశాబ్దాలుగా టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలను దూరం చేసేందుకు గతంలో కాంగ్రెస్, వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు 2019 ఎన్నికల నాటికి బీసీలు టీడీపీని వదిలిపెట్టి వైసీపీకి చేరువయ్యారు. దీంతో సహజంగానే ఈ పరిణామాలు టీడీపీకి అధికారాన్ని దూరం చేసేశాయి. ఆ తర్వాత బీసీల మద్దతు తిరిగి సంపాదించడం కోసం టీడీపీ బీసీ నేతల్ని ముందుకు నెడుతోంది. ప్రభుత్వాన్ని వారితోనే టార్గెట్ చేయిస్తోంది. దీంతో వైసీపీ కూడా కౌంటర్లు వెతుక్కోవడం మెదలుపెట్టింది.

అయ్యన్న జగన్ పై అయ్యన్న వ్యాఖ్యల చిచ్చు

అయ్యన్న జగన్ పై అయ్యన్న వ్యాఖ్యల చిచ్చు

తాజాగా సీఎం జగన్ పై విశాఖ జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. జగన్ పాలనలో జనం ఎదుర్కొంటున్న కష్టాల్ని గుర్తు చేస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ బీసీల కుల వృత్తులైన చేపల అమ్మకాలు, మటన్ అమ్మకాలు చేపట్టడాన్ని టార్గెట్ చేస్తూ అయ్యన్న సీరియస్ వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా అని అయ్యన్న ప్రశ్నించారు. దీంతో వైసీపీకి ఈ వ్యాఖ్యలు ఎక్కడో గుచ్చుకున్నాయి. అయ్యన్న వ్యాఖ్యలపై విలవిల్లాడిన వైసీపీ చివరికి బీసీ నేత అయిన జోగి రమేష్ ను రంగంలోకి దింపింది.

కౌంటర్ గా చంద్రబాబుపై జోగి రమేష్ గురి

కౌంటర్ గా చంద్రబాబుపై జోగి రమేష్ గురి

అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా స్పందించింది. బీసీ నేత అయిన జోగి రమేష్ ను రంగంలోకి దింపింది. దీంతో జోగి రమేష్ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై విమర్శలు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా అంటూ చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని నిన్న ప్రకటించారు. దీంతో జోగి రమేష్ ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అనుకున్నట్లుగానే ఇవాళ ఆయన ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటివద్దకు కారులో చేరుకున్నారు. అక్కడ ఆయన ఊహించినట్లుగానే టీడీపీ నేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చానంటూ కాసేపు హంగామా చేసిన జోగి రమేష్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. చివరికి పరిస్ధితి రాళ్ల దాడుల వరకూ వెళ్లింది. దీనంతటికీ జోగి రమేష్ కారణమయ్యారు.

 బుద్ధా వెంకన్నను పంపిన చంద్రబాబు

బుద్ధా వెంకన్నను పంపిన చంద్రబాబు

ఎప్పుడైతే అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించి తన ఇల్లు ముట్టడిస్తానని ప్రకటించారో అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వ్యూహాత్మక అడుగులు వేశారు. బీసీ నేత అయిన జోగి రమేష్ ను అడ్డుకునేందుకు కరకట్టపైకి తమ పార్టీకి చెందిన బీసీ నేత బుద్దా వెంకన్నను విజయవాడను పిలిపించి మోహరించారు. అనుకున్నట్లుగానే జోగి రమేష్ రాగానే ఆయనపైకి బుద్దా వెంకన్న వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిమధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జోగి రమేష్ కు ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపు అక్కడే ఉండి హంగామా చేసిన జోగి రమేష్.. చివరికి పోలీసుల సాయంతో బయటపడ్డారు. అప్పటికే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. పరిస్ధితిని చక్కదిద్దే పేరిట పోలీసులు జోగి రమేష్ ను అక్కడి నుంచి తరలించారు.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
 జగన్ వ్యూహానికి చంద్రబాబు మార్క్ కౌంటర్

జగన్ వ్యూహానికి చంద్రబాబు మార్క్ కౌంటర్

నిత్యం వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక అంశంపై టీడీపీకి చెందిన బీసీ, ఎస్సీ నేతలు విమర్శలు కూడా చేస్తూనే ఉన్నారు. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతూనే ఉన్నారు. కానీ ఎప్పడూ స్పందించని వైసీపీ.. ఇప్పుడు మాత్రం జోగి రమేష్ ను పంపి బీసీ మంత్రాన్ని ప్రయోగించింది. ఇది కాస్తా టీడీపీ అధినేత బుద్ధా వెంకన్నను రంగంలోకి దింపడంతో బెడిసి కొట్టింది. అదే బుద్ధా వెంకన్న స్ధానంలో మరే ఇతర సామాజిక వర్గ నేత అయినా జోగి రమేష్ ను అడ్డుకుని ఉంటే పరిస్ధితి మరోలా ఉండేది. కానీ చంద్రబాబు ఇక్కడే తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి జోగి రమేష్ ను బుద్దా వెంకన్న అడ్డుకునేలా చేశారు. చివరికి జోగి రమేష్ చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ పరిణామాలన్నీ పూర్తిగా గమనించిన వారికి జగన్ వ్యూహానికి చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ అర్దమయ్యే ఉంటుంది.

English summary
undavalli krishna river front witnessed a war between backward community leaders from tdp and ysrcp today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X