వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం "నాలో..నాతో..వైఎస్సార్ " - చర్యలు తప్పవన్న వైసీపీ...

|
Google Oneindia TeluguNews

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని ఆయన జయంతి సందర్భంగా సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పుస్తకంలో ప్రజలతో, నేతలతో వైఎస్సార్ ఎలా ఉండేవారో... కుటుంబంతో ఎలా ఉండేవారో.. ఆయన్ను దగ్గర నుంచి చూసిన సతీమణి విజయమ్మ జ్ఞాపకాల రూపంలో వివరించారు. ఈ పుస్తకాన్ని ఎమ్మెస్కో పబ్లికేషన్స్ మార్కెట్లో విడుదల చేస్తోంది.

అయితే ఈ పుస్తకం సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల చేసిన రెండు రోజుల్లోనే వాట్సాప్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. విజయమ్మ పుస్తకం కాపీలను పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తుండటంపై వైసీపీ సీరియస్ అయింది. ఈ పుస్తకం ప్రచురణ హక్కులు, అమ్మకం హక్కులు అన్నీ ఎమ్మెస్కో పబ్లికేషన్స్ కు మాత్రమే ఉన్నాయని, వాట్సాప్ గ్రూపుల్లో ఈ బుక్ కు సంబంధం లేని అంశాలతో ఎవరైనా సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇవాళ హెచ్చరించారు.

ysrcp warns action on fake whatsapp circulation of vijayammas book nalo naltho ysr

Recommended Video

Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu

ఈ పుస్తకంలోని అంశాలు.. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైల్‌లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని, దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్‌చేస్తున్నారుని సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీగారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వైయస్సార్‌ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని కోరుతున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటనలో తెలిపారు.

English summary
ysrcp warns to take stringent action against fake circulation of party honarary president ys vijayamma's recent book on her late husband "nalo..natho..ysr" in whatsapp groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X