వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వ్యూహమిదే: పాదయాత్రకు ముందే 60 డేస్ ప్లాన్

2019 ఎన్నికలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. నిత్యం ప్రజల మధ్యే ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. పాదయాత్ర ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జగన్ ప్రచారం చేయనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. నిత్యం ప్రజల మధ్యే ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. పాదయాత్ర ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జగన్ ప్రచారం చేయనున్నారు. అయితే పాదయాత్రకు ముందు 60 రోజుల కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది.

వైసీపీ రాష్ట్రస్థాయి నియోజకవర్గ కో ఆర్డినేటర్ల విస్తృతస్థాయి సమావేశం సోమవారం నాడు హైద్రాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుండి సమన్వయకర్తలు హజరయ్యారు.

రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యాచరణపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఈ ఎన్నికలకు ముందుగా పాదయాత్రను నిర్వహించనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు.

అయితే ఈ పాదయాత్రకు ముందుగా కూడ కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో వైసీపీ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాలను వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం నాడు మీడియాకు వివరించారు.

నవరత్నాల సభలు

నవరత్నాల సభలు

ఈ ఏడాది ఆగష్టు 11 నుండి 29 వరకు నవరత్నాల సభలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఇళ్ళను పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు కలుస్తారు. నవరత్నాల హమీల ప్రధాన్యాన్ని గుర్తించి ప్రజలకు వివరించాలని ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హమీలపై ఇంతకుముందు పార్టీ విడుదల చేసిన ప్రజా బ్యాలెట్ గురించి అడగాలని సూచించారు.

Recommended Video

YSRCP To Win AP in 2019 : Survey Reports
సభ్యత్వ నమోదు కార్యక్రమం

సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 2 వరకు వైసీపీ కుటుంబం పేరుతో సభ్యత్వ కార్య్కమాన్ని చేపట్టనున్నట్టు ఉమ్మారెడ్డి ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదును ఆన్‌లైన్‌లో కూడ నమోదు చేసుకొనే వెసులుబాటు కల్పించామన్నారు. పార్టీ ఇచ్చే ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్స్ ఇస్తే వారికి సభ్యత్వం ఇచ్చే ప్రక్రియను కొనసాగించనున్నట్టు ప్రకటించారు.

విజయశంఖారావం

విజయశంఖారావం

పాదయాత్రపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను అక్టోబర్ 2వ, తేది నుండి 25వరకు పోలింగ్‌బూత్ పరిధిలో సమావేశాలను నిర్వహించనున్నట్టు వైసీపీ ప్రకటించింది. పాదయాత్ర ఈ ఏడాది 26 లేదా 27న, జగన్ పాదయాత్ర ప్రారంభం కానుందని ఉమ్మారెడ్డి ప్రకటించారు. ఈ పాదయాత్ర పూర్తయ్యేలోపుగానే ఈ మూడు కార్యక్రమాలను పూర్తి చేయాలని వైసీపీ పార్టీ శ్రేణులకు సూచించింది.

ప్రశాంత్‌కిషోర్ బృందం సహకారం

ప్రశాంత్‌కిషోర్ బృందం సహకారం

ఈ మూడు కార్యక్రమాలు విజయవంతమయ్యేలా ప్రశాంత్‌కిషోర్ బృందం సహకరించనుందని ఉమ్మారెడ్డి ప్రకటించారు. పాదయాత్రను అవసరమైతే జగన్ తన పాదయాత్రను మరిన్ని రోజులకు పొడిగించుకొనే అవకాశాలు కూడ ఉన్నాయని ఉమ్మారెడ్డి ప్రకటించారు.

English summary
Ysrcp will start to 60 days programme from aug 11, 2017.Ysrcp state meeting held in Ravi Narayana reddy auditorium at Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X