• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విదేశీ వనితపై రేప్..?: జగనన్న సైనికుడి నీచం, ఎక్కడచూసినా వారే: టీడీపీ అనిత విసుర్లు,

|

అధికార వైసీపీపై టీడీపీ మహిళా నేత అనిత మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ కార్యకర్తల తీరుపై స్పందించారు. ఎక్కడచూసిన అన్న సైనికులే అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జగనన్న రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని నినాదించిన అనిత.. ఈ సారి శ్రేణుల ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి విదేశీ వనితతో అసభ్య ప్రవర్తనకు సంబంధించి ట్వీట్ చేశారు.

  AP CM Jagan, CM KCR, Pawan Kalyan's #IndependenceDay2020 Celebrations || Oneindia Telugu

  విదేశీ వనితపై లైంగికదాడి యత్నం..?

  విదేశీ యువతిపై పురేందర కుమార్ అనే యువకుడు లైంగికదాడి చేయబోయాడు. హైదరాబాద్‌లో ఘటన జరగడంతో.. సదరు యువతి 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పురందర కుమార్ సహా మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పురేందర కుమార్ వైసీపీ నేత కావడంతో.. అనిత విమర్శలకు మరింత పదును కల్పించారు. ఎక్కడ చూసిన అన్న సైనికులే అంటూ ధ్వజమెత్తారు.

  నంద్యాల వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తీరు ఇదీ

  నంద్యాల వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తీరు ఇదీ

  పురేందర కుమార్ కర్నూలు జిల్లా నంద్యాల 6వ వార్డు కౌన్సిలర్ వైసీపీ అభ్యర్థి అని అనిత ట్వీట్ చేశారు. ఆయన జగన్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా ట్వీట్‌లో జతపరిచారు. జగనన్న రాజ్యంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని.. ఏపీలోనే కాదు తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. విదేశీ యువతిపై లైంగికదాడి చేయబోయి తెలుగు రాష్ట్రాల పరువును పురేందర కుమార్ తీశాడని మండిపడ్డారు.

  సజీవ సాక్ష్యం...

  సజీవ సాక్ష్యం...

  వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు అనడానికి ఇదీ సజీవ సాక్ష్యం అని అనిత పేర్కొన్నారు. వీరిని మందలించాల్సిన అవసరం ఉందని.. కానీ విచిత్రంగా వైసీపీ హైకమాండ్ వెనకేసుకొస్తోందని ఆరోపించారు. ఏపీలో జరిగిన ఘటనలను ఉదహరించారు. దళితులపై దాడులు.. దళిత జడ్జీపై అటాక్ గురించి ప్రస్తావించారు. జగనన్న రాజ్యంలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదా అని ధ్వజమెత్తారు. టూరిస్ట్‌ను కూడా వేధించిన పురేందర కుమార్ లాంటి వారి వల్ల తెలుగు రాష్ట్రాల పరువుపోతుందన్నారు.

  కులం పేరుతో దురహంకారం..

  కులం పేరుతో దురహంకారం..

  మరోవైపు కులానికి సంబంధించి వీడియోను కూడా అనిత ట్వీట్ చేశారు. అందులో రెడ్లకు సంబంధించిన సమావేశంలో ఒకరు మాట్లాడుతూ.. మీ స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో రెడ్లనే చేర్చుకోవాలని కోరారు. దానికి సంబంధించి ఓ యువకుడు కూడా వైద్యుని వద్దకు వెళ్గగా.. మీరు రెడ్డి అని అడిగాడని చెప్పారు. అలా ఎలా చెబుతారని అంటే.. మీ రక్తంలో సేవ చేయాలని తపన కనిపిస్తోందని.. అందుకే రెడ్ల అని అడిగానని చెప్పారు.

  దళితులకు మర్యాద ఇవ్వాలీ..

  దళితులకు మర్యాద ఇవ్వాలీ..


  తాను ఎవరికీ కొమ్ముకాయడం లేదు అని అనిత క్లారిటీ ఇచ్చారు. కానీ దళితులకు మాత్రం మర్యాద ఇవ్వాలని.. వారికే తాను రెస్పాక్ట్ ఇస్తానని చెప్పారు. అహంకారంతో కొట్టుకునే తనకు ఇబ్బంది అని.. అందరితో కాదు అని పంచ్ వేశారు. కుల జాఢ్యం గురించి నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనిత కూడా అదేరీతిలో స్పందించారు.

  English summary
  ysrcp worker purendhar to rape foreign girl in hyderabd. when she compalint police arrest purendhar along two members.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X