గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుద్ధా వెంకన్న, బోండా ఉమాలపై వైసీపీ కార్యకర్తల దాడి: బైక్‌పై వెంబడించి..: టీడీపీ ఆరోపణ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈ సారి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపై దాడులు సంభవించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వర రావుపై వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రలతో దాడి చేశారని విజయవాడ టీడీపీ నగర నాయకులు ఆరోపిస్తున్నారు.

మాచర్ల సమీపంలో ఘటన..

మాచర్ల సమీపంలో ఘటన..

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దాడి చోటు చేసుకున్న ప్రదేశంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులు వెళ్తోన్న ఓ కారును వైఎస్ఆర్సీపీ నాయకులు బైక్‌లపై వెంబడించి మరీ..పట్టపగలు దాడి చేశారని విజయవాడ టీడీపీ నగర నాయకులు విమర్శిస్తున్నారు.

కారు అద్దాలు ధ్వంసం..

కారు అద్దాలు ధ్వంసం..


ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని, ఆ ఇద్దరు నాయకులు ప్రాణాలతో బయటపడగలిగారని వెల్లడిస్తున్నారు. మాచర్ల నుంచి దుర్గి వెళ్తోన్న మార్గంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని మాచవరంలో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వెళ్లగా.. అక్కడ వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

బైక్‌పై వెంబడించి మరీ..

బైక్‌పై వెంబడించి మరీ..

దాడులకు గురైన తమ పార్టీ అభ్యర్థులను పరామర్శించడానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు బుధవారం ఉదయం మాచవరానికి బయలుదేరి వెళ్లగా.. మార్గమధయలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారని, వెంబడించి మరీ కర్రలతో దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను వారు మీడియాకు విడుదల చేశారు. ఈ ఘటనపై వారిద్దరూ ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు నిరాకరించినట్లు ఆరోపిస్తున్నారు.

Recommended Video

AP Local Body Elections: Janasena Bjp Manifesto బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా ?
కలకలం రేపుతోన్న దాడులు..

కలకలం రేపుతోన్న దాడులు..

మరోవంక- చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల వద్ద కొందరు భారతీయ జనతా పార్టీ నాయకులపై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తెలుగుదేశం సీనియర్ నాయకులపై అదే తరహా దాడులు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటిదాకా అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.

English summary
Rulling YSR Congress Party workers allegedly attacked on Telugu Desam Party leaders Budha Venkanna and Bonda Umamaheswara Rao near Macharla in Guntur district of Andhra Pradesh. The incident happened near Macharla in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X