• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ తొలి అస్త్రం రఘురామపైనేనా? -పార్లమెంట్ స్తంభన తప్పదా? -వ్యూహాలపై ఎంపీలకు సీఎం నిర్దేశం

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం కొనసాగుతుండగానే, మూడో దశకు సంబంధించి హెచ్చరికలు వెలువడటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించినంత వేగంగా సాగకపోవడం, నిత్యావసరాల ధరలు, పెట్రో మంటలు సామాన్యుణ్ని కాల్చేస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ వేడి మరింత రగిలేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ భేటీలో ప్రాంతీయ పార్టీలు తమవైన ఎత్తుగడలను పన్నుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అధికార వైసీపీ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలను, విసరాల్సిన అస్త్రాలను సిద్ధం చేస్తున్నది. అందుకోసం..

షాకింగ్: ఏపీ సీఎంవోలో ప్రవీణ్ ప్రకాష్‌ అధికారాలకు కోత -జీఏడీ కొత్త చీఫ్‌గా ముత్యాల రాజుషాకింగ్: ఏపీ సీఎంవోలో ప్రవీణ్ ప్రకాష్‌ అధికారాలకు కోత -జీఏడీ కొత్త చీఫ్‌గా ముత్యాల రాజు

వైఎస్సార్‌సీపీపీ భేటీ రేపు

వైఎస్సార్‌సీపీపీ భేటీ రేపు

ఈనెల 19నుంచి జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చించేందుకు పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతున్నది. పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ గురువారం జరుగనుంది. దీనికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డితోపాటు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. ఇందులో..

కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!

నీళ్లు, నిధులు, రుణాలు, హోదా..

నీళ్లు, నిధులు, రుణాలు, హోదా..


అధినేత జగన్ అధ్యక్షతన గురువారం జరగబోయే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలను చర్చించనున్నారు. ప్రధానంగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అంశాలతోపాటు ఇటీవల చర్చనీయాంశమైన రుణ పరిమితి తగ్గింపు, కృష్ణా జలాలపై తెలంగాణతో వివాదాలు వంటి విషయాలపైనా పార్లమెంట్ లో ఏం మాట్లాడాలనేదానిపై ఎంపీలకు సీఎం సూచనలు చేయనున్నారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పైనా చర్చించుకుని, దాన్ని సభ ముందుకు తెచ్చేలా వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. అలాగే,

  Vizag Steel Plant : కార్మికుల పోరాటం ఉధృతరూపం.. జగన్ సర్కార్ పై ఒత్తిడి..!!
  రఘురామపై సభలో రచ్చ తప్పదా?

  రఘురామపై సభలో రచ్చ తప్పదా?

  సొంత పార్టీపై, సీఎం జగన్ పై సంచలన విమర్శలు, అనూహ్య ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని, ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణికి నిరసనగా అవసరమైతే సభను స్తంభింపజేస్తామని కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే, ఈ వర్షాకాల సమావేశాల్లోనే రఘురామపై వేటు పడేలా స్పీకర్ నిర్ణయం ఉండొచ్చనీ వైసీపీ ఎంపీలు తాజాగా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి, రఘురామ అంశాన్ని సభ మొదట్లోనే లేవనెత్తేందుకు జగన్ అనుమతిచ్చినట్లయితే సాయిరెడ్డి చెప్పినట్లు సభ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు లేకపోలేవు. మరోవైపు కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న ఏపీ సీఎం జగన్ తోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా సీఎంలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

  English summary
  ysrcp parliamentary party meeting chaired by party chief and andhra pradesh chief minister ys jagan mohan reddy on thursday. jagan to direct party mps on strategies to be followed in parliament monsoon session which will begin from july 19. pending funds, water dispute with telangana, reduction of debt limit, special status, rebel mp raghu rama are likely among discussion points.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X