వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే కెసిఆర్‌ను అందలమెక్కించారు: చంద్రబాబుపై వైవి సుబ్బారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కెసిఆర్‌ను చంద్రబాబు అందలమెక్కించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రధాని నరేంద్ర మోడీ చేత చంద్రబాబు మట్టి, నీళ్లు తెప్పించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చెరుకు పంటలు తగులబెట్టడంపై విచాణ జరిపేందుుక తమ పార్టీ తరఫున ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 YV Subba Reddy accuses Chandrababu compromised with KCR

గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారంనాడు రైతు గద్దె చంద్రశేఖర్ చెరకు పంటను దగ్ధం చేశారు. ఐదు ఎకరాల్లో ఉన్న చెరుకును నాశనం చేశారు. మల్కాపురంలో ఈ ఘటన జరిగింది. రైతు చంద్రశేఖర్ ల్యాండ్ పూలింగ్‌లో రాజధానికి భూములు ఇవ్వలేదు. దీంతో కక్ష గట్టి ఆయన చెరుకు పంటను దగ్ధం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ కంపెనీకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సిపిఎం రాష్ట్ర కార్యద్రశి మధు ఆరోపించారు. జపాన్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజల ముందు వెల్లడించాలని ఆయన ిడమండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కార్పోరేట్ కంపెనీలతో ఒప్పందాల వల్ల బ్రిటిష్ పాలన మాదిరిగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

English summary
YSR Congress Ongole MP YV Subba Reddy accused that Andhra Pradesh CM Nara Chandrababu naidu compromised with Telangana CM K Chandrasekhar rao to bail out from cash for vote case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X