వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీ ఛైర్మెన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జీవో జారీ..శనివారం ప్రమాణస్వీకారం

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమిస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సంతకం చేశారు. ఆయన నియామకపు ఉత్తర్వులు అధికారికంగా వెలువడ్డాయి.శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైవీకి కీలక పదవిని ఇస్తూ, జగన్ పత్రాలపై సంతకం చేశారు. ఆ వెంటనే నియామకపు ఉత్తర్వులు టీడీపీ ఈఓ అనిల్ సింఘాల్ కు అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపారు.

Recommended Video

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి.?

పదవిలో కొనసాగుతున్న టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్, మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం ఉదయం 11 గంటలకు శ్రీవారి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.మరోవైపు పాత సభ్యులను రద్దు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

subba reddy

టీటీడీ ఛైర్మెన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరు ఎప్పుడైతే జగన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వార్త బయటకొచ్చిందో ఇక అప్పటి నుంచే వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవుడనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఒక క్రైస్తవుడికి ఆ పదవిని ఎలా కట్టబెడతారనే ప్రశ్నలు సైతం వినిపించాయి. వైవీ సుబ్బారెడ్డి తొలి నుండి హిందువే. ఆయ‌న క్రైస్త‌వ మ‌తం తీసుకోలేదు. తొలి నుండి ఆధ్యాత్మిక కార్యాక్ర‌మాలు..దేవాల‌యాల సంద‌ర్శ‌న‌.. నిత్యం నుదుటి మీద బొట్టుతో క‌నిపిస్తారు. అయితే, ఇదే వీకిపీడియాలో సుబ్బారెడ్డి క్రిస్టియ‌న్ అని చూపిస్తున్న అంశాన‌ని హైలైట్ చేస్తూ..టీటీడీ ఛైర్మ‌న్‌గా ఎలా నియ‌మిస్తార‌ని ప్ర‌శ్నించారు. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకే వెళ్లారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మెన్‌గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

English summary
Former MP YCP leader YV Subba Reddy is appointed as TTD Chairman. AP govt had issued GO regarding the same. Subba Reddy is expected to take the Oath on saturday. The new members will also be appointed soon said the GO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X