వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ .. సోషల్ మీడియాలో హల్చల్ ... జనసేన క్లారిటీ ఇదే !!

|
Google Oneindia TeluguNews

జనసేన పార్టీ అధినేత, క్రేజ్ ఉన్న సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రతను కల్పించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా పవన్ కళ్యాణ్ పర్యటించిన ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనకు జడ్ కేటగిరీ భద్రతను కల్పించనున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం హల్ చల్ చేసింది.
పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తుందన్న వార్తలపై సోషల్ మీడియాలో కూడా భిన్న స్వరాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై జనసేన స్పష్టతనిచ్చింది .

దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ .. పవన్ కు మద్దతుగా చిరంజీవి సతీమణి కూడా ..దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ .. పవన్ కు మద్దతుగా చిరంజీవి సతీమణి కూడా ..

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీపై చర్చ ..భిన్న వాదనలు

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీపై చర్చ ..భిన్న వాదనలు

కొంతమంది పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆంటీ సోషల్ ఎలిమెంట్స్ అటాక్ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు జనసేనాని ,బీజేపీతో కలిసినందుకే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఏ అర్హతతో పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదని, అలాంటి వ్యక్తి కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

 పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత .. ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన జనసేన

పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత .. ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన జనసేన

జనసేన పార్టీ బీజేపీతో కలిసి సాగుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతా కారణాల దృష్ట్యా జెడ్ కేటగిరి భద్రత కల్పించినట్టుగా జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి తాము ఎవరినీ సంప్రదించలేదని, పవన్ కళ్యాణ్ తనకు జెడ్ కేటగిరీ భద్రత కావాలని కోరలేదని, కేంద్రం నుంచి ఎవరూ తమకు ఈ విషయాన్ని స్పష్టం చేయలేదని జనసేన పార్టీ కార్యాలయం పేర్కొంది.

Recommended Video

#GramaSwarajyamInAP : గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి CM Jagan అభినందనలు! || Oneindia
సోషల్ మీడియాలో రచ్చగా కేంద్ర సెక్యూరిటీ నిర్ణయాలు

సోషల్ మీడియాలో రచ్చగా కేంద్ర సెక్యూరిటీ నిర్ణయాలు

ఇది కేవలం దుష్ప్రచారం అని జనసేన పార్టీ కొట్టిపారేసింది. ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న రూమర్స్ గా పేర్కొంది.
ఒకవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని అసాంఘిక శక్తులు టార్గెట్ చేస్తున్న విఐపి జాబితాలో చేర్చినట్లుగా జరిగిన ప్రచారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది . ఇప్పటికే కేంద్రం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో పాటుగా రేసు గుర్రం విలన్ రవి కిషన్ కి కూడా వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించిన విషయం తెలిసిందే. దీనిపైన ఇప్పటికే రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో తాజాగా పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు అన్న ప్రచారం సోషల్ మీడియాలోదుమారం రేపింది .

English summary
Power star Pawan Kalyan, the Janasena chief has been widely rumored to have been given z category security by the central government. As per the Centre's directives to this effect, there was a campaign on social media that Pawan Kalyan would be given Z category security in Telangana, Andhra Pradesh and other places he visited.Janasena, however, clarified the news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X