గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడేపల్లి ఎస్ఐపై ‘జీరో’ ఎఫ్ఐఆర్ నమోదు: మోసం చేయడంతో మహిళ ఆత్మహత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్ఐ బాలకృష్ణ తనను మోసం చేశారంటూ రెండు రోజుల క్రితం ఓ మహిళ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఆమెపై నీళ్లు పోసి కాపాడారు.

ఈ ఘటన నేపథ్యంలో సీరియస్ అయిన ఉన్నతాధికారులు.. ఎస్ఐని వీఆర్‌కు పిలిచారు. గతంలో గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాధిత మహిళ తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు బాలకృష్ణపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

 zero fir filed on tadepalli si balakrishna, due to cheating woman

ఆ తర్వాత తాడేపల్లికి బదిలీ చేశారు. జులై 23న రాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మళ్లీ ఆ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. బాలకృష్ణ మోసం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కృష్ణా జిల్లాలో దొంగల కలకలం
కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. నందిగామలోని రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో వాచ్‌మెన్‌పై దాడి చేసిన దొంగలో చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామలోని చందాపురం రోడ్డులోని మద్యం షాపు, నందిగామ జాతీయ రహదారిపై ఉన్న మధ్యం షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.

అయితే, కౌంటర్లలో పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో ఉన్న రూ. 1500లతో పారిపోయారు. మరో షాపులో వాచ్‌మెన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English summary
zero fir filed on tadepalli si balakrishna, due to cheating woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X