వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా మృతి -అర్జెంటీనాలోని సొంతింట్లో గుండెపోటు రావడంతో

|
Google Oneindia TeluguNews

ఫుట్‌బాల్ అనే ఆటకు పర్యాయపదంగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పొందిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం డిగో మారడోనా(60) ఇక లేరు. కొన్ని రోజుల కిందటే బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్న క్రమంలో బుధవారం సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారని అర్జెంటీనా మీడియా సంస్థలు వెల్లడించాయి.

 షాకింగ్: ఎన్నికల వాయిదాకు కుట్ర -సీఎం కేసీఆర్ సంచలనం -పోలీసులకు ఫుల్ పవర్స్ -వివరాలివే షాకింగ్: ఎన్నికల వాయిదాకు కుట్ర -సీఎం కేసీఆర్ సంచలనం -పోలీసులకు ఫుల్ పవర్స్ -వివరాలివే

మారడోనా మరణ వార్తతో క్రీడాలోకం షాక్ కు గురైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఆయన ఇంటికి వేలాది మంది అభిమానులు క్యూ కట్టారు. దీంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మెదడులో రక్తం గడ్డ కట్టిన ఇబ్బందులతో మారడోనా ఈ నెల ఆరంభంలోనే ఆస్పత్రిలో చేరగా, ఆపరేషన్ విజయవంతమైంది. ఇక తేరుకుంటాడని అభిమానులు ఆశించేలోపే చేదు వార్త వినాల్సి వచ్చింది.

Argentina football legend Diego Maradona dies at age of 60

1986లో అర్జెంటీనాకు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అందించిన మారడోనా.. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో డిగో జన్మించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడలో తనదైన ముద్రవేసిన మారడోనా మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అర్జెంటీనా తరఫున 96 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన మారడోనా మొత్తం 34 గోల్స్‌ చేశారు. పీలే తర్వాత అంతటి పాపులారిటీ సాధించిన డిగో.. కెరీర్‌ ద్వితీయార్థంలో డ్రగ్స్ కు బానిసయ్యారు. 1991లో డోపింగ్‌ పరీక్షలో పట్టుబడి 15 నెలలు నిషేధానికి గురయ్యారు. నాలుగుసార్లు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌కు ప్రాతినిధ్యం వహించిన మారడోనా 1997లో ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్టుకు మేనేజర్‌గా కూడా మారడోనా పనిచేశారు.

English summary
Diego Maradona has died at the age of 60 after suffering a cardiac arrest, according to multiple reports. The football legend had a heart attack at his home just two weeks after leaving hospital where he underwent surgery on a blot clot in his brain. Maradona, regarded as one of the greatest footballers of all time, helped Argentina win the World Cup in 1986, the pinnacle of an illustrious career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X