వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోహ్లీసేన మాస్ ఎయిర్ లిఫ్ట్: టీమిండియా సిరీస్‌పై అనుమానాలు: టెస్టులు రద్దవుతాయా?: కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అక్కడ నెలకొన్న పరిణామాలు ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతిపాదిత సిరీస్ మీద ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ కొనసాగుతుందా? లేదా? అనే అనుమానాలు ఇప్పుడిప్పుడే తలెత్తుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తేనే.. సిరీస్ కొనసాగొచ్చని అంటున్నారు. టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. బయో సెక్యూర్ బబుల్‌లో భాగంగా వారంతా సిడ్నీలోని ఓ హోటల్‌లో క్వారంటైన్ కాలాన్ని గడుపుతున్నారు.

పోలవరం వద్ద వంద అడుగుల వైఎస్సార్ విగ్రహం: మరో రాజకీయ రాద్ధాంతం?: మంత్రి అనిల్ సందర్శనపోలవరం వద్ద వంద అడుగుల వైఎస్సార్ విగ్రహం: మరో రాజకీయ రాద్ధాంతం?: మంత్రి అనిల్ సందర్శన

 సుదీర్ఘ పర్యటనకు బ్రేక్..

సుదీర్ఘ పర్యటనకు బ్రేక్..

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20, నాలుగు టెస్టు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. దీనికోసం ఈ నెల 13వ తేదీ నాడే భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లింది. భారత జట్టు సిడ్నీ ఒలింపిక్ పార్క్ హోటల్‌లో బస చేసింది. ఈ నెల 27వ తేదీన సిడ్నీ స్టేడియంలో జరిగే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌తో ఈ సుదీర్ఘ సిరీస్ ఆరంభం కానుంది.

 టెస్ట్ సిరీస్‌లపై అనుమానాలు..?

టెస్ట్ సిరీస్‌లపై అనుమానాలు..?

వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్ మ్యాచ్‌ల మాట ఎలా ఉన్నప్పటికీ.. టెస్టు సిరీస్‌పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనికి కారణం.. కరోనా వైరస్. ఆస్ట్రేలియా దక్షిణ ప్రాంతంలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. సౌత్ ఆస్ట్రేలియాలో అయిదు కరోనా కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. సెకెండ్ వేవ్ పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఫలితంగా- సౌత్ ఆస్ట్రేలియాతో సరిహద్దులను పంచుకుంటోన్న వెస్టర్న్ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్, టాస్మానియా స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. సౌత్: ఆస్ట్రేలియాతో సరిహద్దులను మూసివేశాయి.

కరోనా కేసులు మరింత పెరిగితే..

కరోనా కేసులు మరింత పెరిగితే..

ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. టెస్టు మ్యాచ్‌లను కొనసాగించాల్సి వస్తే.. న్యూ సౌత్ వేల్స్ నుంచి అడిలైడ్‌కు మాస్ ఎయిర్ లిఫ్ట్ చేయాలని భావిస్తోంది. న్యూ సౌత్ వేల్స్ నుంచి సౌత్ ఆస్ట్రేలియా ప్రధాన నగరం అడిలైడ్‌కు ఎయిర్ లిఫ్ట్ చేయడం.. మ్యాచ్ ముగిసిన వెంటనే మళ్లీ వాయు మార్గంలోనే వారిని న్యూ సౌత్ వేల్స్‌కు తరలించేలా ప్రణాళికలను రూపొందించుకుంటోంది. వచ్చేనెల 17వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. అప్పటి వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది.

అడిలైడ్‌లో అవుట్ బ్రేక్..

అడిలైడ్‌లో అవుట్ బ్రేక్..

ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహిస్తారా? లేదా? అనేది డౌటే. ఈ ఎయిర్ లిఫ్ట్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) అంగీకరించాల్సి ఉంది. బీసీసీఐ అంగీకరించకపోతే- టెస్ట్ సిరీస్‌ను రద్దు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్‌లు సిడ్నీ, క్యాన్‌బెర్రాలో నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ రెండు చోట్ల పెద్దగా ఇబ్బందికర పరిణామాలు ఇప్పటిదాకా లేవు. అందుకే- ఈ రెండు ఫార్మట్లలో మ్యాచ్‌లను ముగించుకుని ఇంటిదారి పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Cricket Australia is reportedly bracing for a mass airlift of players and staff into New South Wales in an attempt to save the eagerly-awaited series against India as a coronavirus outbreak in South Australia threatens the start of the upcoming summer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X