Gangster: 112 క్రిమినల్ కేసులు, ఎన్నికల్లో పోటీకి రెఢీ, దూలతీరింది ఎదవకి, 50 ఎకరాలకు లోన్, జల్సా!
బెంగళూరు/ తుమకూరు/ మైసూరు: అక్కినేని నాగార్జున నటించిన సంతోషం సినిమాలో ఐయామ్ గిరి, ఫ్రమ్ మంగళగిరి అంటూ బ్రహ్మానందం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఇక్కడ గిరి అనే మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ అంతకు వందరెట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 112 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ గిరి కోసం పోలీసులు వెతుకుతుంటే అయ్యగారు 50 ఎకరాల భూమిని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు రుణం తీసుకుని ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసి వైట్ కాలర్ రాజకీయ నాయకుడు అయిపోదామని అనుకున్నాడు. అందరికీ కార్తీక మాసం కలసి వస్తుంటే గిరికి మాత్రం గ్రహాలు అనుకూలించపోవడంతో అతని ఆశలు తల్లకిందులైపోయి వాడి దూలతీరిపోయింది.

జస్ట్ 112 క్రిమినల్ కేసులు అంతే
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలుకాలోని కుదూరు నివాసి గిరి అలియాస్ కుణిగల్ రవి మీద బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ లోని రౌడీషీటర్ జాబితాలో అతని పేరు ఉంది. ఇప్పటి వరకు కుణిగల్ గిరి మీద దోపిడీలు, హత్యలు, బెదిరింపులు, సెటిల్ మెంట్ లు, లూటీలు తదితర 112 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రా, తమిళనాడు జాయింట్ ఆపరేషన్
2014లో జరిగిన అతి పెద్ద రాబరి కేసులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి కుణిగల్ రవిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కుణిగల్ గిరి రివాల్వర్ తూటా రుచి చూశాడు. ఆప్పటి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి దివంగత బాళేగౌడ కుణిగల్ గిరి మీద కాల్పులు జరపడంతో పెద్ద చర్చకు దారితీసింది.

జైల్లో సగం జీవితం
అనేక కేసుల్లో జైలు పాలైన కుణిగల్ రవి అక్కడి నుంచి అతని అనుచరులతో దందాలు చేయిస్తూ కాలం గడిపాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఓ హత్య కేసులో సైకో విశ్వనాథ్ అలియాస్ విశ్వ, లక్ష్మణ అలియాస్ సుళిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. సైకో విశ్వనాథ్, లక్ష్మణ ఇచ్చిన సమాచారం మేరకు కుణిగల్ గిరిని పోలీసులు అరెస్టు చేశారు.

పొలిటికల్ లీడర్ కావాలని స్కెచ్
పోలీసు తుపాకి తూట రుచి చూసిన తరువాత కుణిగల్ రవి అతని నేరాలు తగ్గిచుకున్నాడని పోలీసులు అన్నారు. డిసెంబర్ నెలలో కర్ణాటకలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని కుణిగల్ గిరి జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. త్వరలో నామినేషన్ వెయ్యడానికి కుణిగల్ గిరి సిద్దం అయ్యాడు. అయితే సైకో విశ్వనాథ్, లక్ష్మణ లు అరెస్టు కావడం, ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు కుణిగల్ గిరి అరెస్టు కావడంతో అతని ఆశలు తారుమారు అయ్యాయని పోలీసులు అంటున్నారు.

50 ఎకరాల భూమి... బ్యాంకులో లోను ?
కుణిగల్ సమీపంలోని కుదూరు దగ్గర కుణిగల్ గిరికి సుమారు 50 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అ పొలం మీద బ్యాంకులో రుణం తీసుకున్న గిరి వ్యవసాయం చేయిస్తూ జల్సా చేస్తూ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు. ఏకంగా 112 క్రిమినల్ కేసులు నమోదైన మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యాడని వెలుగు చూడటంతో పోలీసులతో పాటు ప్రజలు షాక్ అయ్యారు. గత నవంబర్ 7వ తేదీన బెంగళూరు శివార్లలోని సుమ్మనహళ్ళి రింగ్ రోడ్డులో మంజునాథ్ అనే కారు డ్రైవర్ హత్య కేసులో కుణిగల్ గిరిని అరెస్టు చేశామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు.