• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కర్ణాటకలో ఘోరం : ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతి, చనిపోయారా ? చంపేశారా ? రాహుల్ గాంధీ ఫైర్

|

కర్ణాటక రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మరణించిన సంఘటన కరోనా మహమ్మారి తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.ఆక్సిజన్ కొరత కారణంగా 24 మంది రోగులు కర్ణాటకలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.ఈ సంఘటన కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. డెత్ ఆడిట్ నివేదిక కోసం మేము ఎదురు చూస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సురేష్ కుమార్ తెలిపారు.

  #Coronavirusinindia : PM Modi Gets Second Vaccine Dose ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ !!
  చామరాజనగర్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది మృతి

  చామరాజనగర్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది మృతి

  చామరాజనగర్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక్కరోజే 24 మంది రోగుల ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్న రోగులు.ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతోనే వారంతా మరణించారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే మృతులు అందరికీ ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వారి మరణానికి అప్పుడే కారణం చెప్పలేమని చెబుతున్నారు వైద్యులు.

  కర్ణాటకలో ఆక్సిజన్ లేక 24 మంది మరణించిన ఘటనపై ఆరోగ్య మంత్రి

  కర్ణాటకలో ఆక్సిజన్ లేక 24 మంది మరణించిన ఘటనపై ఆరోగ్య మంత్రి

  ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి బిఎస్ యడియరప్ప చమరాజనగర్ లోని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు.చమరాజనగర్లో ఏమి జరిగిందో దురదృష్టకర సంఘటన అని పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని సిఎంతో చర్చించానని తెలిపారు. స్వయంగా తాను మైసూరు, మాండ్యా, చమరాజనగర్ లకు వెళుతున్నానని,మరణాలు ఎలా జరిగాయో,అక్కడ సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తా అని ఆయన పేర్కొన్నారు.

  చనిపోయారా ? చంపేశారా .. రాహుల్ గాంధీ ఫైర్

  చనిపోయారా ? చంపేశారా .. రాహుల్ గాంధీ ఫైర్

  చమరాజనగర్ సంఘటన తో పాటుగా ఆక్సిజన్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా నమోదైన మరణాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చనిపోయారా లేదా చంపేశారా? అంటూ మండిపడ్డారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. వ్యవస్థ మేల్కోవాలి అంటే ఇంకా ఎంత ఎక్కువ బాధలు ప్రజలు అనుభవించాలి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్‌లో ప్రశ్నించారు.

  దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కోసం ఆస్పత్రుల్లో ఆందోళన

  దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కోసం ఆస్పత్రుల్లో ఆందోళన

  దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు,ముఖ్యంగా కోవిడ్ -19 కేసుల పెరుగుదలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు, సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫామ్‌లపై సహాయం కోసం అర్థిస్తూ సందేశాలను పంపుతున్నాయి, ఆసుపత్రులలో క్షీణిస్తున్న ఆక్సిజన్ నిల్వలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.నిన్న రాత్రి బళ్లారి నుండి రావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా ఆలస్యం కావడంతో ఆసుపత్రికి చేరుకోకపోవడంతో మొత్తం 250 ఆక్సిజన్ సిలిండర్లను అర్ధరాత్రి మైసూర్ నుండి ఆసుపత్రికి పంపారు.

  రేపు కర్ణాటక సీఎం అత్యవసర భేటీ

  రేపు కర్ణాటక సీఎం అత్యవసర భేటీ

  24 మంది ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపిస్తుంటే అలాంటి సమస్య ఏమీ లేదని , మరణించిన వారి పోస్ట్ మార్టం నివేదికలు వస్తేనే వారి మరణానికి సంబంధించిన అసలు కారణం చెప్పటానికి వీలవుతుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒకే రోజు ఇంత మంది మరణించటం దారుణం . ఈ పరిస్థితుల నేపధ్యంలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప రేపు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు .

  English summary
  As many as 24 patients, including the Covid-19 positive, died at a hospital in Karnataka's Chamarajanagar allegedly due to the oxygen shortage.Rahul Gandhi attacked the central government ,questioned "Died or Killed?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X