బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా పాజిటివ్, కలెక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చిన కాలాంతకుడు ఎస్కేప్, అబ్బా తెలివి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ (COVID 19) కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి విరుగుడుకు ఇంత వరకు మందులు కనిపెట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆ వ్యక్తులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు. కరోనా పరీక్షలు చేసుకున్న తరువాత ఎక్కడ తనకు కరోనా వస్తుందో ?, ఎక్కడ తనను క్వారంటైన్ లో పెడుతారో ? అనే భయంతో ఓ కాలాంతకుడు ఏకంగా కలెక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎస్కేప్ అయ్యాడు. తీరా అతనికి కరోనా పాజిటివ్ అని తెలుసుకుని అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి వెంటనే నువ్వు క్వారంటైన్ లోకి వెళ్లాలి, నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని COVID-19 కంట్రోల్ రూం అధికారులు చెప్పడంతో ఫోన్ రిసీవ్ చేసుకున్న కలెక్టర్ కళ్లు గిర్రున తిరిగిపోయాయి. నేను ఎప్పుడు కరోనా పరీక్షలు చేసుకున్నాను ?, నేను కలెక్టర్ మాట్లాడుతున్నానని సమధానం రావడంతో అధికారులు దిమ్మతిరిగిపోయింది.

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తోMafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

 హెబ్బాళ నివాసికి కరోనా పరీక్షలు

హెబ్బాళ నివాసికి కరోనా పరీక్షలు

కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ది చెందిన రాచనగరి మైసూరు సిటీలోని హెబ్బాళలో నివాసం ఉంటున్న వ్యక్తి అనారోగ్యానికి గురైనాడు. తరువాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహామేరకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా వైద్యపరీక్షలు చేసుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అతని ఓటరు ఐడీ కార్డు కానీ, ఆధార్ కార్డు కాని తీసుకోకుండా కేవలం ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత నీకు సమాచారం ఇస్తామని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించారు.

 కరోనా పాజిటివ్ వస్తే అంతే కథ !

కరోనా పాజిటివ్ వస్తే అంతే కథ !

మైసూరులోని హెబ్బాళలో నివాసం ఉంటున్న వ్యక్తి వైద్య పరీక్షలు చేసుకున్న తరువాత ఆందోళన చెందాడు. కరోనా పరీక్షలు చేసుకున్న తరువాత ఎక్కడ తనకు కరోనా వస్తుందో ?, ఎక్కడ తనను క్వారంటైన్ లో పెడుతారో ? అనే భయంతో అతను అప్పటికే మైసూరు జిల్లా కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మాయం అయిపోయాడు.

 కలెక్టర్ అభిరామ్ కు షాక్

కలెక్టర్ అభిరామ్ కు షాక్

హెబ్బాళలో నివాసం ఉంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. వెంటనే మైసూరులోని COVID-19 కంట్రోల్ రూం సిబ్బంది అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సార్ మీకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది, వెంటనే మీరు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్వారంటైన్ లో చేరాలి అని చెప్పారు. తనకు కరోనా పాజిటివ్ అని ఫోన్ చేసి చెప్పడంతో మైసూరు జిల్లా కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ షాక్ కు గురైనారు.

 ఎవరికి ఫోన్ చేశారు ? నేను కలెక్టర్

ఎవరికి ఫోన్ చేశారు ? నేను కలెక్టర్

కోవిడ్ -19 కంట్రోల్ రూం నుంచి వచ్చిన ఫోన్ లో వివరాలు ఓపికగా తెలుసుకున్న కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ నేను కలెక్టర్ ను మాట్లాడుతున్నాను, మీరు ఎవరికి ఫోన్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి అని సమాధానం చెప్పారు. కలెక్టర్ సమాధానంతో బిత్తరపోయిన కంట్రోల్ రూం సిబ్బంది సార్ అతను మీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు సార్, మా తప్పు ఏమీలేదని కుయ్యోమర్రో అంటూ సమాధానం ఇచ్చారు.

 కలెక్టర్ అభిరామ్ క్లారిటీ

కలెక్టర్ అభిరామ్ క్లారిటీ

తనకు కరోనా పాజిటివ్ అని కోవిడ్ -19 కంట్రోల్ రూం నుంచి ఫోన్ వచ్చిందని మైసూరు జిల్లా కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ స్పష్టం చేశారు. ఫోన్ కాల్ వచ్చిన తరువాత నేను మొదట షాక్ కు గురైనానని కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ అన్నారు. కొందరు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత క్వారంటైన్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారని, వారు ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో అర్థం కావడంలేదని మైసూరు జిల్లా కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ విచారం వ్యక్తం చేశారు.

 అర్థం చేసుకోండి

అర్థం చేసుకోండి

కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు క్వారంటైన్ లో వ్యాధి నయం చేసుకోవడానికి అవకాశం ఉందని, దయచేసి తప్పుడు అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇలా ప్రభుత్వాన్ని మోసం చెయ్యకూడదని మైసూరు జిల్లా కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ ప్రజలకు మనవి చేశారు. ఇక ముందు ఎవరైనా వచ్చి కరోనా వైద్య పరీక్షలు చేయించుకుంటే కచ్చితంగా ఆధార్ కార్డుతో పాటు ముందుగానే ఫోన్ నెంబర్లు చెక్ చేసుకుని తీసుకుని వారిని బయటకు పంపించాలని కోవిడ్ 19 కంట్రోల్ రూం సిబ్బందికి కలెక్టర్ అభిరామ్ జి. శంకర్ సూచించారు. కలెక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చిన మాయం అయిన హెబ్బాళ నివాసి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 సిలికాన్ సిటీలో 4, 500 మంది కేటుగాళ్లు

సిలికాన్ సిటీలో 4, 500 మంది కేటుగాళ్లు

ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరు సిటీలో కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్న సుమారు 4, 500 మంది తప్పుడు అడ్రస్ లు, పక్కింటోళ్ల ఫోన్ నెంబర్లు ఇచ్చి మాయం అయిపోయారు. ఇలాంటి తప్పుడు అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పారిపోయిన వారిని పట్టుకోవడానికి బెంగళూరు సిటీ పోలీసులు నానాతిప్పులు పడుతున్నారు.

English summary
Coronavirus: A COVID-19 infected person in Mysuru gave district collector (DC) phone number instead of his phone number to escape in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X