బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: బెళ్లందూరులో బెళగే బెళగే సినిమా, వన్ బై వన్ కరోనా, అపార్ట్ మెంట్ సీజ్, పెళ్లిళ్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ (COVID-19)విరుచుకుపడుతోంది. ఒకే అపార్ట్ మెంట్ లో వన్ బై వన్ అంటూ 10 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. బెళ్లందూరులో బెళగే బెళగే కరోనా వైరస్ సినిమా చూపించింది. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో 1,500 మందికిపై నివాసం ఉన్నారు. ఇప్పటికే 500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 9 బ్లాక్ లు ఉన్న అపార్ట్ మెంట్ ను సీజ్ చేసిన అధికారులు పరిసర ప్రాంతాలను రోడ్ జోన్ గా ప్రకటించడంతో స్థానికులు బిత్తరపోయారు. ఈ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు వరుసగా రెండు పెళ్లిళ్ల శుభకార్యాలు నిర్వహించారని సమాచారం.

Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్ !Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్ !

అపార్ట్ మెంట్ కాంప్లెక్స్

అపార్ట్ మెంట్ కాంప్లెక్స్

బెంగళూరులోని బెళ్లందూరు వార్డులో ఎస్ జేఆర్ వాటర్ అపార్ట్ మెంట్ లో మొత్తం 9 బ్లాక్ లు ఉన్నాయి. ఈ అపార్ట్ మెంట్ లో 1,500 మందికిపైగా నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ రాత్రి వాళ్ల వాళ్ల ఫ్లాట్ లకు చేరుకుంటున్నారు. ఇదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్ల బంధువులు వచ్చి వెళ్లారు.

వన్ బై వన్.... షాక్

వన్ బై వన్.... షాక్

గత సోమవారం నుంచి ఇదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు ఒకరి తరువాత ఒకరు మొత్తం 10 మంది కరోనా బారినపడ్డారు. ఒకే అపార్ట్ మెంట్ లో 10 మందికి కరోనా పాజిటివ్ అని తెలసిన వెంటనే BBMP అధికారులు, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు ఆ పార్ట్ మెంట్ దగ్గరకు పరుగు తీశారు.

 దెబ్బకు సీల్ డౌన్

దెబ్బకు సీల్ డౌన్

అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న 500 మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఆ వైద్యపరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని బీబీఎంపీ కమిషనర్ ఎన్. మంజునాథ ప్రసాద్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే 9 బ్లాక్ లు ఉన్న ఎస్ జేఆర్ వాటర్ అపార్ట్ మెంట్ మొత్తం సీజ్ చేశామని బీబీఎంపీ కమిషనర్ ఎన్. మంజునాథ్ ప్రసాద్ మీడియాకు చెప్పారు.

పెళ్లిళ్ల దెబ్బకు పరుగో పరుగు

పెళ్లిళ్ల దెబ్బకు పరుగో పరుగు

ఎస్ జేఆర్ వాటర్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు వరుసగా రెండు వివాహ శుభాకార్యాలు నిర్వహించారని అధికారులు అంటున్నారు. ఎస్ జేఆర్ వాటర్ అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల్లోని 200 మీటర్ల ప్రాంతం మొత్తం శానిటైజ్ చేశామని, ఇతరులను ఈ అపార్ట్ మెంట్ లోని అనుమతించడం లేదని, అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లను బయటకు పంపించడం లేదని బీబీఎంపీ మహదేవపుర విభాగం ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేంద్ర స్థానిక మీడియాకు చెప్పారు.

కర్ణాటకలోకి నో ఎంట్రీ

కర్ణాటకలోకి నో ఎంట్రీ

బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి కర్ణాటకలో అడుగుపెడుతున్న వారు కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఆ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని, లేదంటే కర్ణాటకలోకి అనుమతించమని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

English summary
Coronavirus: A COVID-19 alert has been sounded in an apartment complex in Bengaluru after 10 people were found positive for the coronavirus, officials said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X