• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్ ట్విస్ట్: జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పైనే చెప్పుతో ఆ మహిళ దాడి, బాధితురాలిగా వీడియో

|

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనపై దాడి చేసి గాయపర్చాడంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు జరిగిన విషయాన్ని జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ అటు పోలీసులకు, ఇటు జోమాటో యాజమాన్యానికి వివరించాడు.

షాకింగ్: మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేసిన జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ (వీడియో)షాకింగ్: మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేసిన జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ (వీడియో)

తనపై జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ దాడి చేశారంటూ మహిళ ట్వీట్

మంగళవారం ఈ ఘటన జరుగగా.. బాధితురాలు బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హితేషా చంద్రానీ.. డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనను ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేశాడని కన్నీటిపర్యంతమవుతూ తెలిపింది. దీనిపై జోమాటో యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వారు స్పందించారు. ఈ ఘటన గురించి తమకు తెలియజేసినందుకు ధన్యవాదాలంటూ జోమాటో ఆమెకు భరోసా ఇచ్చింది. ఇలాంటి దాడులను తాము సహించమని, సరైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అంతేగాక, తమ కంపెనీకి చెందిన స్థానిక ప్రతినిధులు బాధితురాలిని కలిసి వివరాలను తెలుసుకుంటారని, ఆమెకు తగిన విధంగా సహాయం చేస్తారని జోమాటో తెలిపింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకునేలా చూస్తామని ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

డెలివరీ ఆలస్యమైందని దూషణలకు దిగింది..

అయితే, పోలీసులు సదరు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను విచారించగా.. అసలు విషయం బయటపడింది. హితేషా.. జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే, జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కాస్త ఆలస్యంగా ఆ ఆర్డర్ తీసుకొచ్చాడు. ట్రాఫిక్, రోడ్డు బాగాలేని కారణంగా ఆలస్యమైందని, తనను క్షమించాలని హితేషాను కోరాడు. అయితే, ఆమె మాత్రం అతనిపై దూషణలకు దిగింది.

జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పైకి చెప్పు విసిరిన మహిళ

జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పైకి చెప్పు విసిరిన మహిళ

క్యాష్ డెలివరీ కావడంతో అతను డబ్బులు అడిగాడు, కానీ, ఆమె ఇవ్వలేదు. అంతేగాక, అతనిపై చెప్పులు విసిరి దాడి చేసింది. ఆమె దాడిని అడ్డుకునేందుకు డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన చేతులను అడ్డుపెట్టాడు. దీంతో ఆమె చేతికి ఉన్న ఉంగరం ఆమె ముక్కును చీరింది. ఈ క్రమంలో ఆమె ముక్కుపైగా గాయమై రక్తం కారింది. ఈ నేపథ్యంలోనే ఆమె తనపై జోమాటో ఎగ్జిక్యూటివ్ దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది.

హై రేటెడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు అండగా నెటిజన్లు, జోమాటో కూడా

అయితే, తాను రెండేళ్లుగా జోమాటోలో పనిచేస్తున్నానని, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఆమె చాలా అహంకారపూరితంగా వ్యవహరించి తనపైనే దాడి చేసి బాధితురాలిగా ఫిర్యాదు చేసిందని వాపోయాడు సదరు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్. అసలు విషయం తెలుసుకున్న జోమాటో సదరు డెలివరీ ఎగ్జిక్యూటివ్ హై రేటెడ్ డెలివరీ బాయ్ అని, అతనికి అండగా ఉంటామని తెలిపింది. అదే సమయంలో ఆరోపణలు చేసిన మహిళకు కూడా కావాల్సిన సాయం అందిస్తామని పేర్కొంది. ఇక నిన్నమొన్నటి వరకు సదరు మహిళకు మద్దతు పలికిన నెటిజన్లు అసలు విషయం తెలుసుకుని ఆమెపై మండిపడుతున్నారు. అంత అహంకారం పనికిరాదంటూ ఆమెకు చీవాట్లు పెడుతున్నారు. జీవనాధారంగా తన విధులను బాధ్యతగా నిర్వహిస్తున్న వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A day after a Bengaluru woman named Hitesha Chandranee accused the Zomato delivery executive of assaulting her which left her nose bleeding in a video, the person in question has denied all her claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X