Attack: రియల్ ఎస్టేట్ వ్యాపారిని నడిరోడ్డులో నరికేశారు, మర్మాంగం మీద వేటకొడవలితో ?, నెల్లూరు!
బెంగళూరు: ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. బెంగళూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో అతను జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరుకావడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి కోర్టుకు హాజరైనాడు. కోర్టు విచారణకు హాజరైన రియల్ వ్యాపారి స్నేహితులతో మాట్లాడి కారులో బయలుదేరాడు. మార్గం మద్యలో నిత్యం రద్దీగా ఉండే సర్కిల్ కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కారును అడ్డగించిన ప్రత్యర్థులు అతన్ని దారుణంగా నరికేశారు.
వేటకోడవళ్లతో నరకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రాణాలు పోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్మారంగం మీద వేట కొడవలితో నరకడం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కారులో అనేక కీలక పత్రాలు ఉన్నా వాటిని ప్రత్యర్థులు వదిలేసి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు దారితీసింది.
Illegal
affair:
8వ
అంతస్తు
బాల్కనీలో
భార్య,
సైలెంట్
గా
తోసి
చంపేసిన
భర్త,
చెల్లెలు
అని!

నెల్లూరు టూ బెంగళూరు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన రాజశేఖర్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి (38) బెంగళూరు చేరుకుని బీటీఎం లేఔట్ లో నివాసం ఉంటున్నాడు. ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లా నివాసి రాజశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. బెంగళూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో రాజశేఖర్ రెడ్డి జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

చెక్ బౌన్స్ కేసు విచారణ
రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ కోర్టుకు హాజరుకావడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డి బుధవారం కోర్టుకు హాజరైనాడు. కోర్టు విచారణకు హాజరైన రియల్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డి అతని స్నేహితులతో మాట్లాడి రాత్రి 8 గంటలకు కారులో బయలుదేరాడు.

ఫ్రెండ్స్.... లాయర్ తో మాట్టాడిన రియల్ వ్యాపారి
రాత్రి 8 గంటల సమయంలో అనేకల్ లోని కేసు వాదిస్తున్న న్యాయవాది కార్యాలాయానికి వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ లాయర్ తో మాట్లాడాడు. తరువాత కారులో రాజశేఖర్ రెడ్డి బెంగళూరులోని బీటీఎం లేఔట్ లోని ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆనేకల్ లోని శివాజీ సర్కిల్ లోని మోర్ మాల్ దగ్గర ప్రత్యర్థులు రాజశేఖర్ రెడ్డి కారును అడ్డగించారు.

నడిరోడ్డులో నరికేశారు..... చిన్న చాన్స్ ఇవ్వలేదు
నిత్యం రద్దీగా ఉండే శివాజీ సర్కిల్ లోని మోర్ మాల్ సమీపంలోని కారులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డిని అతని ప్రత్యర్థులు దారుణంగా నరికేశారు. రాజశేఖర్ రెడ్డి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అతనికి ప్రత్యర్థులు ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు. వేటకోడవళ్లతో నరకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మర్మాంగం మీద నరికేశారు
రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డి మర్మారంగం మీద వేట కొడవలితో నరకడం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ రెడ్డి కారులో అనేక కీలక పత్రాలు ఉన్నా వాటిని ప్రత్యర్థులు వదిలేసి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు దారితీసింది.
పాతకక్షల కారణంగా రాజశేఖర్ రెడ్డిని చంపేశారా ?, చెక్ బౌన్స్ కేసులో హత్య జరిగిందా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అంటూ ఆరా తీస్తున్నామని డీఎస్పీ మల్లేష్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురి కావడం బెంగళూరు నగర శివార్లలో కలకలం రేపింది.