Super Madam: సుధా నకిలి పత్రాల స్కామ్, రూ. వందల కోట్ల పరిహారం స్వాహా, మేడమ్ కు సీక్రెట్ ఏజెంట్లు !
బెంగళూరు/ మైసూరు/ ఉడిపి: కర్ణాటక కేఏఎస్ అధికారి డాక్టర్ బి. సుధా మేడమ్ అక్రమాస్తులు వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ భూములు, రైతుల భూములకు నకిలి పత్రాలు సృష్టించి వందల కోట్ల రూపాయల నగదును డాక్టర్ సుధా లూటీ చేసిందని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. సుధా మేడమ్ మధ్యవర్తులు, సీక్రెట్ ఏజెంట్ ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. డాక్టర్ సుధాకు సహకరించిన మధ్యవర్తుల ఇళ్లలో నకిలి పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఏసీబీ అధికారుల సిక్స్ కొట్టడంతో సుధా మేడమ్ తో పాటు ఆమె ఏజెంట్ల బాల కనపడకుండా పోయింది.
Beautiful wife: ఎవరు వాళ్లు ? ఎందుకొస్తున్నారు ?, భార్య గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసిన భర్త !

బీడీఏలో ఉద్యోగం అంటే లడ్డూ చిక్కినట్లే
2013వ సంవత్సరం నుంచి కొన్ని నెలల క్రితం వరకు డాక్టర్ సుధా బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (BDA)ప్రధాన కార్యాలయంలో కేఏఎస్ అధికారినిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో భూ లావాదేవీలు నిర్వహించడానికి బీడీఏ కార్యాలయానికి వచ్చి వెలుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవడానికి వచ్చి వెళ్లిన రైతులు, భూ యజమానుల నుంచి డాక్టర్ సుధా కొన్ని కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని వెలుగు చూసింది.

మేడమ్ కు ఏ టైపులో అయినా నో ప్రాబ్లామ్
బెంగళూరులోని బీడీఏలో KAS అధికారిగా పని చేసిన డాక్టర్ సుధా ఆమె అధికారం అడ్డం పెట్టుకుని ఎవరైనా వాళ్ల పని చేయించుకోవడానికి వస్తే వారి దగ్గర నగదుతో పాటు భారీ మొత్తంలో ఇంటి స్థలాలు, భూములు, అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లు, ఖరీదైన కార్లు, బంగారం, వెండి ఇలా ఏదో ఒక రూపంలో లంచాలు తీసుకున్నారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

నకిలి పత్రాలతో గోల్ మాల్
బెంగళూరులోని కెంపేగౌడ లేఔట్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో కేఏఎస్ అధికారిని డాక్టర్ సుధా భూస్వాధీన అధికారిగా పని చేశారు. ఆ సందర్బంలో కెంపేగౌడ లేఔట్ తో పాటు విశ్వేశ్వరయ్య లేఔట్ లో నకిలి పత్రాలు సృష్టించిన డాక్టర్ సుధా మధ్యవర్తుల సహాయంతో వందల కోట్ల రూపాయలు గోల్ మాల్ చేసిందని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

40 ఎకరాల ప్రభుత్వ భూమి
భూస్వాధిన అధికారిగా పని చేసిన డాక్టర్ సుధా సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలి పత్రాలు సృష్టించిందని, మధ్యవర్తులు, ఏజెంట్ల సహాయంతో పరిహార నిధిని వారి బ్యాంకు ఖాతాలకు మళ్లించిందని, అసలైన వారికి పరిహారం అందలేదని ఏసీబీ అధికారుల విచారణలో బయటపడింది. నాడప్రభు కెంపేగౌడ లేఔట్ లో స్వాధీనం చేసుకున్న భూముల యజమానులకు ఇంత వరకు పూర్తి పరిహారం అందలేదని, ఆ లేఔట్ లో చాలా అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు గుర్తించారు.

సుధా మేడమ్ ఏజెంట్లకు షాక్
సుధాకు సహకరించిన మధ్యవర్తులు దోడ్డ అలదమర నివాసి మహేష్, బీమప్ననకుప్ప నివాసి నరహరి తదితరుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి నకిలి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎకరాకు రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించిందని, ఆ డబ్బును మధ్యవర్తుల సహాయంతో వేరే వారికి మళ్లించి ఆ నగదును కేఏఎస్ అధికారిని డాక్టర్ సుధా స్వాహా చేసిందని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. సుధా మేడమ్ ఏజెంట్ల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న నకిలి పత్రాలు, వారి గోల్ మాల్ కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.