• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యువతి నగ్న వీడియో ట్రాప్... ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న యువకుడి ఆత్మహత్య.. ఇలా వెలుగులోకి...

|

ఇటీవలి కాలంలో నగ్న వీడియోలతో యువకులను ట్రాప్ చేసి బ్లాక్‌మెయిలింగ్,వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ వేధింపులు తాళలేక కొంతమంది యువకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఓ యువకుడు ఇలాగే ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఐఏఎస్ కావాలని కలలు కన్నవాడు... ఆ ముఠా వేధింపులకు తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి అతనెందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మొదట కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత అతని సోదరి... అతని ఫేస్‌బుక్ మెసేంజర్‌ను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

బెంగళూరులోని కేఆర్ పురం ప్రాంతంలో ఉన్న భట్టరహళ్లి రెసిడెన్సీలో 26 ఏళ్ల యువకుడు కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.ఎంబీఏ పూర్తి చేసిన అతను ప్రస్తుతం ఐఏఎస్ ప్రిపరేషన్‌లో ఉన్నాడు. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సివిల్స్‌కు ప్రిపరే అవుతున్న కుమారుడు ఎందుకీ అఘాయిత్యం చేసుకున్నాడో కుటుంబ సభ్యులకు అంతుచిక్కలేదు. అతని గదిలో సూసైడ్ నోట్ కూడా ఏమీ లభించలేదు. అయితే మృతుడి సోదరి... అతని ఫేస్‌బుక్ మెసేంజర్ పరిశీలించడంతో అసలు తెలిసింది.

ఇలా వెలుగులోకి...

ఇలా వెలుగులోకి...

ఫేస్‌బుక్ మెసేంజర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మృతుడిని బెదిరిస్తూ చేసిన మెసేజ్‌లు అతని సోదరి చూసింది. అతను ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు రూ.36వేలు వారి బ్యాంకు ఖాతాలో తన సోదరుడు జమ చేసినట్లు గుర్తించింది. అసలు వాళ్లెవరో తెలుసుకునేందుకు సోదరుడి ఫేస్‌బుక్ మెసేంజర్ నుంచి వారికి మెసేజ్ పెట్టింది. అతను చనిపోయిన విషయాన్ని వారితో చెప్పకుండా చాకచక్యంగా వ్యవహరించింది. ఆ ముఠా ఫోన్ నంబర్ అడగడంతో తమ బంధువు నంబర్ ఇచ్చింది. దీంతో తేజాస్ మరేష్ భాయ్ అనే వ్యక్తి... డబ్బులు పంపించాలని బెదిరిస్తూ ఆ ఫోన్ నంబర్‌కు మెసేజ్ చేశాడు.

నగ్న వీడియో కాల్‌తో ట్రాప్...

నగ్న వీడియో కాల్‌తో ట్రాప్...

వెంటనే మృతుడి సోదరి పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా వారితో చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరపగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నేహా శర్మ అనే ఓ ఫేస్‌బుక్ ఖాతా నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ను బాధితుడు యాక్సెప్ట్ చేసినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య చాటింగ్,వీడియో కాల్స్ జరిగినట్లు గుర్తించారు.

ఇదే క్రమంలో ఆ యువతి బాధితుడికి నగ్నంగా వీడియో కాల్ చేసి... అతన్ని కూడా దుస్తులు విప్పమని చెప్పడంతో ట్రాప్‌లో పడినట్లు నిర్దారించారు. ఆమె చెప్పినట్లు అతను నగ్నంగా వీడియో కాల్ చేయడంతో... ఆ వీడియోను రికార్డ్ చేసి,దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడినట్లు తేల్చారు.

  Idli History | Health Benefits Of Idli | World Idli Day
  ఐదుగురి అరెస్ట్...

  ఐదుగురి అరెస్ట్...

  బాధితుడి నుంచి భారీ ఎత్తున సైబర్ ముఠా భారీగా డబ్బు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. డబ్బు ఇవ్వని పక్షంలో వీడియోను లీక్ చేస్తామని బెదిరించారన్నారు. దీంతో పలుమార్లు కొంత మొత్తంలో బాధితుడు వారికి డబ్బు పంపించాడని... అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశామని... త్వరలోనే ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

  English summary
  A 26-year-old civil services aspirant hanged himself to death after he was allegedly blackmailed by cyber criminals who got acquainted with him on Facebook.The victim, also an MBA graduate, was found hanging at his Bhattarahalli residence near KR Puram on March 23.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X