• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Jalsa: పెళ్లాం హ్యాండ్, అత్త కూతురు ఎస్కేప్, మొగుడికి, ఢీల్ ఢమాల్, చేసినోడికి చేసుకున్నంత !

|

బెంగళూరు: ఏటీఎం యంత్రాల్లో పెట్టాల్సిన రూ. 64 లక్షల నగదుతో పరారైన కిలాడీ అత్త కూతురితో మస్త్ మజా చేస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. అత్త కూతురితో జల్సా చెయ్యడానికి 7 రోజుల్లో రూ. 30 లక్షలు స్వాహా చేసేశాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి లాయర్ కు ఏకంగా 26 లక్షలకు డీల్ మాట్లాడుకున్నాడు. కట్టుకున్న భర్త వదిలేసి వెళ్లిపోవడం, అత్త కూతురు ఎస్కేప్ కావడం, నమ్ముకున్న లాయర్ హ్యాండ్ ఇవ్వడంతో మనోడు జైల్లో చెక్క భజన చేస్తున్నాడు. చేసినోడికి చేసుకున్నంత అంటే ఇదేమరి.

Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !

బెంగళూరు కేటుగాడు

బెంగళూరు కేటుగాడు

బెంగళూరులో ఫిబ్రవరి 3వ తేదీన యోగీష్ తో పాటు సెక్యూర్ వ్యాల్యూ ఉద్యోగులు బెంగళూరులోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లారు. సాటి సిబ్బంది కళ్లుకప్పిన కేటుగాడు యోగీష్ ఏటీఎం యంత్రాల్లో నిల్వ చెయ్యాల్సిన రూ. 64 లక్షల నగదుతో పరారైనాడు. చివరికి ఏటీఎం క్యాష్ వ్యాన్ జీపీఎస్ ఆధారంగా ఆ వాహనాన్ని ఓ ప్రాంతంలో గుర్తించి దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్కెచ్ అదిరిపోయింది

స్కెచ్ అదిరిపోయింది

రూ. 64 లక్షల నగదుతో మాయం అయిన యోగీష్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రూ. 64 లక్షలతో మాయం అయిన తరువాత యోగీష్ అతని మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేటుగాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం పోలీసులు గుర్తించలేకపోయారు. పోలీసు ఇన్స్ పెక్టర్ లతా ఆధ్వర్యంలో యోగీష్ కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలించినా మొదట చిన్న క్లూ కూడా పోలీసులకు చిక్కలేదు.

భార్యకు క్రీమ్ బిస్కెట్

భార్యకు క్రీమ్ బిస్కెట్

బెంగళూరులోని నందిని లేఔట్ లో యోగీష్ కు భార్య రూపవతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ. 64 లక్షలు లూటీ చేసి యోగీష్ నేరుగా నందిని లేఔట్ లోని ఇంటికి వెళ్లాడు. తాను ఆఫీసు పనిమీద కుక్కేసుబ్రమణ్య పుణ్యక్షేత్రంకు వెలుతున్నానని, బెంగళూరుకు తిరిగి రావడానికి కొన్ని రోజులు పడుతుందని భార్య రూపవతిని నమ్మించాడు. లూటీ చేసి డబ్బుల్లో భార్య రూపవతి ఇంటి ఖర్చుల కోసం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చిన యోగీష్ ఆమెకు క్రీమ్ బిస్కెట్ వేసి చెక్కేశాడు.

మొగుడు వదిలేసిన అత్తకూతురు

మొగుడు వదిలేసిన అత్తకూతురు

యోగీష్ కు అత్త కూతురు సీతల్ అనే బ్యూటీ ఉంది. సీతల్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యి ఓ కొడుకు ఉన్నాడు. ముంబాయిలో ఉంటున్న భర్తతో అన్యోన్యంగా లేని సీతల్ భర్తకు దూరంగా ఉంటోంది. ఓ పక్క అత్తకూతురు సీతల్ తో ఎంజాయ్ చెయ్యడానికి, భార్య రూపవతి, ఇద్దరు పిల్లలను పోషించడం కష్టం కావడంతో యోగీష్ ఏటీఎం క్యాష్ లూటీ చెయ్యాలని చాలా కాలం నుంచి ప్లాన్ వేసుకున్నాడు.

 లాయర్ తో డీల్... ఢమాల్

లాయర్ తో డీల్... ఢమాల్

అత్తకూతురు సీతల్ తో పరారైన యోగీష్ మైసూరు జిల్లాలోని హెచ్ డీ కోటేలో ఓ ఇంటిని తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేశాడు. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారని, నువ్వు వెంటనే లాయర్ ను సంప్రధించాలని యోగీష్ కు అతని ఫ్రెండ్ సూచించాడు. క్రిమినల్ లాయర్ శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడిన యోగీష్ కేసు నుంచి నన్ను తప్పిస్తే నీకు రూ. 46 లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడుకున్నాడు. క్రీమినల్ లాయర్ శ్రీధర్ కు లూటీ చేసిన డబ్బులో భారీ మొత్తం ఇచ్చాడు.

 రూ. లక్షలు మాయం

రూ. లక్షలు మాయం

పోలీసులు యోగీష్ మొబైల్ టవర్ ఆధారంగా హెచ్ డీ కోటే చేరుకున్నారు. అత్త కూతురు సీతల్ తో మస్త్ మజా చేస్తున్న యోగీష్ ను పోలీసులు పట్టుకున్నారు. యోగీష్ దగ్గర కేవలం రూ. 34 లక్షలు మాత్రమే రికరీ అయ్యిందని, మిగిలిన రూ. 30 లక్షలు కేవలం ఏడు రోజుల్లో ఖర్చు చేశాడని పోలీసులు అన్నారు. యోగీష్ అరెస్టు అయ్యి ఇన్ని రోజులు అయినా ఆ డబ్బును పోలీసులు పూర్తిగా రికవరి చెయ్యలేకపోయారు.

 పెళ్లాం పోయే, అత్త కూతురు పోయే. ఉద్యోగం పోయే

పెళ్లాం పోయే, అత్త కూతురు పోయే. ఉద్యోగం పోయే

యోగీష్ అరెస్టు కావడంతో అతని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. మామ కొడుకు జైలుకు వెళ్లడంతో ఎక్కడ ఈ కేసులో ఇరుక్కుంటామో అంటూ అత్త కూతురు సీతల్ ప్రియుడు యోగీష్ కు హ్యాండ్ ఇచ్చింది. కేసు నుంచి తప్పిస్తాడని అనుకున్న లాయర్ శ్రీధర్ సైతం అతను కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. జైల్లో ఉన్న యోగీష్ బెయిల్ ఇప్పించే దిక్కులేక కుమిలిపోతున్నాడు. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఇదే మరి.

English summary
Bengaluru ATM Van Driver who escape with Rs 64 lakh with his sister in law arrested in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X