బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Heroines: సంజనా, రాగిణి కేసులో ట్విస్ట్, కోర్టుకే వార్నింగ్, నలుగురికి బాహుబలి కంటే పెద్ద సినిమా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తుమకూరు/ ముంబాయి: స్యాండిల్ వుడ్ క్వీన్స్ సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిల బెయిల్ ఇవ్వాలని కోర్టుకు బెదిరింపు లేఖలు రాసిన నలుగురికి పోలీసులు బాహుబలి కంటే పెద్ద సినిమా చూపిస్తున్నారు. బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయ్యి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు బెయిల్ ఇచ్చి విడుదల చెయ్యకపోతే మిమ్మల్ని బాంబులతో పేల్చేస్తామని కోర్టుకు, జడ్జికి, పోలీసులకు బెదిరింపు లేఖలు పంపించి కలకలం రేపిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తమిళ సినిమా స్కెచ్ వేసి అడ్డంగా బుక్కైపోయిన నలుగురి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలు లాగా తయారైయ్యింది.

Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

 రాగిణి, సంజనాల షాడో ఫ్యాన్స్ !

రాగిణి, సంజనాల షాడో ఫ్యాన్స్ !

డ్రగ్స్ దందా కేసులో హీరోయిన్లు సంజనా, రాగిణి అరెస్టు అయ్యి జైలుపాలైనారు. డ్రగ్స్ కేసులో రాగిణి, సంజనాలకు ఇంత వరకు బెయిల్ రాలేదు. వెంటనే రాగిణి, సంజనాలకు బెయిల్ ఇవ్వండి, లేదంటే కోర్టులో బాంబులు పెట్టి పేల్చేస్తాం అంటూ ఓ పార్శిల్ లేఖ బెంగళూరు సిటీ సివిల్ కోర్టుకు పంపించారు. బెంగళూరు కోర్టుకు పంపించిన పార్శిల్ కవర్ లో డిటోనేటర్ ఉండటంతో కలకలం రేపింది. కవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని విచారణ చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ ముమ్మరం చేసి తుమకూరులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వాళ్లకు బాహుబలి కంటే పెద్ద సినిమా చూపిస్తున్నారు.

 తుమకూరులో తుమ్మితే చిక్కిపోరా ?

తుమకూరులో తుమ్మితే చిక్కిపోరా ?

తుమకూరుకు చెందిన రాజశేఖర్, వేదాంత్, శివప్రకాష్, రమేష్ అనే నిందితులను మంగళవారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుమకూరులో అరెస్టు చేసిన నలుగురు నిందితులను బెంగళూరు తీసుకెళ్లి అక్కడ విచారణ చేసి మరన్ని వివరాలు సేకరించాలని నిర్ణయించామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులు తుమకూరులో తుమ్మిన విషయం పోలీసులు పసిగట్టారు.

 ఆస్తి కోసం తమిళ సినిమా స్కెచ్

ఆస్తి కోసం తమిళ సినిమా స్కెచ్

తుమకూరుకు చెందిన రాజశేఖర్, వేదాంత్, శివప్రకాష్, రమేష్ చాలా దగ్గర బంధువులు. రాజశేఖర్, వేదాంత్, శివప్రకాష్, రమేష్ ల మద్య ఆస్తి పంపకాలలో గొడవలు జరుగుతున్నాయి. వేదాంత్, శివప్రకాష్, రమేష్ లను ఎలాగైనా జైలుకు పంపించాలనే ఉద్దేశంతోనే వారి పేర్లతో రాజశేఖర్ కోర్టును, బెంగళూరు పోలీసు అధికారులను బెదిరిస్తూ లేఖలు రాశాడని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే నిజానిజాలు పూర్తిగా తెలియాలంటే వీరిని మరింత విచారణ చెయ్యాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు డిసైడ్ అయ్యారు.

 కారు ఇంజిన్ లో బాంబులు పెడుతాం

కారు ఇంజిన్ లో బాంబులు పెడుతాం

బెంగళూరులో సిటీ సివిల్ కోర్టులోని CCH 36వ కోర్టుకు సోమవారం సాయంత్రం కర్ణాటకలోని తుమకూరు జిల్లా నుంచి ఓ పార్శిల్ కవర్ పోస్టులో వచ్చింది. నటి రాగిణి, నటి సంజనాలు అమాయకులు, వాళ్లు ఏ తప్పు చెయ్యలేదు, అనవసరంగా ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు, మీకు ఏమి కావాలో చెప్పండి, మేము ఇస్తాం, వెంటనే వారిద్దరికి బెయిల్ ఇవ్వండి, లేదా బెయిల్ రావడానికి సహకరించండి, లేదా మీ కారు ఇంజన్లలో బాంబులు పెట్టి లేపేస్తాం అని బెదిరిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది.

 రాగిణి, సంజనాలకు ఫ్రీ పబ్లిసిటి

రాగిణి, సంజనాలకు ఫ్రీ పబ్లిసిటి

స్యాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి, నటి సంజనాల డ్రగ్స్ కేసు విచారణ, బెంగళూరులోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి గొడవల కేసుల విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్, బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్, అడిషనల్ పోలీసు కమిషనర్ కేపీ. రవికుమార్ తదితరులను బెదిరిస్తూ ఓ లేఖ పంపించారు. ఈ కేసుల విచారణ నుంచి తప్పుకోవాలని, నిందితులకు బెయిల్ ఇవ్వకపోతే పోలీసు అధికారుల కార్లలో బాంబులు పెట్టి పేల్చేస్తాం అంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. నిందితులు పోలీసులకు, న్యాయమూర్తులకు లంచాలు ఇస్తామని ఎరవేసి మరో పెద్ద తప్పు చేశారు.

 అనుమానం రాకుండా అక్కడి నుంచి పార్శిల్

అనుమానం రాకుండా అక్కడి నుంచి పార్శిల్

పోలీసు అధికారులకు వచ్చిన బెదిరింపు లేఖల్లో ఎలాంటి పార్శిల్ లేదు. అయితే కోర్టుకు పంపించిన బెదిరింపు లేఖలో డిటోనేటర్ ఉండటం కలకలం రేపింది. ఈ రెండు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలుకా బేళూరులోని పోస్టుఆఫీసు (తపాలా కార్యాలయం) నుంచి బెంగళూరు సిటీ సివిల్ కోర్టులోని ప్రత్యేక కోర్టుకు బెదిరింపు లేఖ, డిటోనేటర్ పార్శిల్ వచ్చిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తుమకూరు నుంచి బెంగళూరు కోర్టుకు బెదిరింపు లేఖ రాస్తే చిక్కిపోతాము అనే భయంతో నిందితుడు రాజశేఖర్ బేళూరు ప్రాంతానికి ఎంచుకున్నాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

English summary
Bengaluru bomb threat: Bengaluru City Court Bomb threat case the four accused have been taken in to police custody in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X